రోజూ మటన్ లెగ్ సూప్ తాగితే.. నిజంగానే ఎముకలు అతుక్కుంటాయా?.. చర్మం యవ్వనంగా మారుతుందా?

ఏదైనా ప్రమాదం వల్ల శరీరంలోని ఎముకలు విరిగితే ఇంట్లో పెద్దవారు మేక ఎముకలతో చేసిన సూప్‌ తాగమని సూచిస్తుంటారు.

By అంజి
Published on : 2 Sept 2025 11:29 AM IST

Health benefits, mutton leg soup, Immunity

రోజూ మటన్ లెగ్ సూప్ తాగితే.. నిజంగానే ఎముకలు అతుక్కుంటాయా?.. చర్మం యవ్వనంగా మారుతుందా?

ఏదైనా ప్రమాదం వల్ల శరీరంలోని ఎముకలు విరిగితే ఇంట్లో పెద్దవారు మేక ఎముకలతో చేసిన సూప్‌ తాగమని సూచిస్తుంటారు. దీన్నే చాలా మంది పాయా అని, మటన్‌ బోన్‌ సూప్‌ అని, మటన్‌ లెగ్‌ సూప్‌ అని కూడా అంటుంటారు. జ్వరం వచ్చినప్పుడు కూడా కొందరు ఈ సూప్‌ తాగితే ఆరోగ్యం కుదుటపడుతుందని చెబుతారు. అయితే ఈ సూప్‌ తాగడం వల్ల నిజంగానే విరిగిన ఎముకలు అతక్కుకుంటాయా? ఇది నిజంగానే మనకు బలాన్ని ఇస్తుందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

అవును ఈ సూప్‌ తాగడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ విడుదల చేసిన రిపోర్ట్‌ ప్రకారం.. పొట్టేళ్‌లు, మేకల కాళ్లలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, జింక్‌ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మటన్‌ సూప్‌ తాగడం వల్ల ఎముకలు, కీళ్లు, జుట్టు, చర్మానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి పని చేస్తుంది. అలాగే గొర్రె కాళ్లలో ఉండే కొలాజెన్‌, జెలటిన్‌ మన కీళ్ల ఆరోగ్యానికి సాయపడతాయి. కీళ్ల నొప్పుల నుంచి రిలీఫ్‌ని ఇస్తాయి. కొలాజెన్‌ మన చర్మ సౌందర్యానికి కూడా సాయపడుతుంది. గొర్రె కాళ్లలో ఉండే కొలాజెన్‌ మన చర్మంపై వచ్చే ముడతలు వంటి సమస్యను తగ్గిస్తుంది. రోజూ మటన్‌ సూప్‌ తాగడం వల్ల చర్మం యవ్వనంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రోజూ మటన్‌ బోన్‌ సూప్‌ తాగడం వల్ల అవయవాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. మటన్‌ బోన్‌ సూప్‌లో ఉండే గ్లైసిన్‌, ప్రొలైన్‌ వంటి అమైనో ఆమ్లాలు మన శరీరంలో డీటాక్సిఫికేషన్‌ ప్రాసెస్‌ను సరిగ్గా నిర్వర్తిస్తాయి. అయితే ఈ సూప్‌ను గుండె సమస్యలు, ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు తీసుకోకపోవడం మంచిది. బోన్‌ మాంసాన్ని శుభ్రంగా కడిగిన తర్వాతే వండుకోవాలి. లేదంటే సాల్మనెల్లా, ఈ కోలి వంటి బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. సరిగ్గా ఉడకని బోన్‌ సూప్‌ వల్ల కూడా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story