బెర్రీ పండ్లతో లభించే ఆరోగ్య ప్రయోజనాలివే.!

వేసవి తాపాన్ని తీర్చి మన శరీరాన్ని కాపాడే పండ్లలో బెర్రీ ఒకటి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో దీని పాత్ర చాలా కీలకం.

By అంజి  Published on  17 May 2023 9:36 AM GMT
health benefits, berries, Blackberry

బెర్రీ పండ్లతో లభించే ఆరోగ్య ప్రయోజనాలివే.!

వేసవి తాపాన్ని తీర్చి మన శరీరాన్ని కాపాడే పండ్లలో బెర్రీ ఒకటి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో దీని పాత్ర చాలా కీలకం. పలు రంగుల్లో లభించే ఈ బెర్రీ పండ్లతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్లాక్‌ బెర్రీ - కంటి చూపును, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎముకల్ని బలోపేతం చేసి పేగులను శుద్ధి చేస్తుంది. రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగిస్తుంది. కేన్సర్‌, మధుమేహాలను నివారించడమే గాక నెలసరిని క్రమబద్ధం చేస్తుంది.

క్రాన్‌ బెర్రీ - మెదడు పనితీరును, కంటి చూపును, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహాన్ని, కేన్సర్‌ ముప్పును తగ్గిస్తుంది. జీర్ణక్రియకు మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది.

బ్లూ బెర్రీ - రక్త ప్రసరణను, రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. యాంటీ ఏజింగ్‌ ఏజెంట్‌గా పని చేస్తుంది. మూత్రనాళ సమస్యలను, కేన్సర్‌ ముప్పును తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. వాపుల్ని, గాయాల్ని మాన్పుతుంది.

వైల్డ్ బ్లూ బెర్రీ - మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీవక్రియలను వేగవంతం చేస్తుంది. అల్జీమర్స్‌, కేన్సర్‌, రక్తనాళ సమస్యలను, మధుమేహపు ముప్పును తగ్గిస్తుంది. మూత్రనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

స్ట్రాబెర్రీ - ఇమ్యూనిటీని పెంచి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది. కేన్సర్‌, షుగర్‌ వ్యాధులకు చెక్‌ పెడుతుంది. చర్మానికి నిగారింపునిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచటమే గాక బరువును తగ్గిస్తుంది.

Next Story