బొబ్బర్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. మీరు అస్సలు ఆగరు

ఆరోగ్యానికి మేలు చేసే పప్పు దినుసుల్లో బొబ్బర్లు ప్రధానమైనవి. వీటినే అలసందలు అనీ అంటారు. వీటి వినియోగంతో ఒబేసిటీ మొదలు అనేక

By అంజి  Published on  31 May 2023 1:45 PM IST
Bobbarlu, Alasadalu, health benefits

బొబ్బర్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు ఆగరు

ఆరోగ్యానికి మేలు చేసే పప్పు దినుసుల్లో బొబ్బర్లు ప్రధానమైనవి. వీటినే అలసందలు అనీ అంటారు. వీటి వినియోగంతో ఒబేసిటీ మొదలు అనేక సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. బొబ్బర్లు అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

బొబ్బర్లలోని పరిమితి క్యాలరీలు, కొవ్వులు, అధిక పీచు అధిక బరువును తగ్గించడానికి దోహదపడతాయి. అధిక బరువుతో బాధపడేవారికి బొబ్బర్లు మంచి ఉపయోగకరమైన ఆహారం. మధుమేహం ఉన్న వారికి లో-గ్లిజమిక్‌ ఇండెక్స్‌ కలిగిన బొబ్బర్లు చాలా ఆరోగ్యకరం. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. బొబ్బర్లలోని యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్స్‌ పోషకాహార లోపాన్ని నివారించి రోగాలను కట్టడిచేస్తాయి. శరీరంలోని హానికారక టాక్సిన్స్‌ను నివారిస్తాయి. బొబ్బర్లు రక్తంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించి గుండె జబ్బు రాకుండా చేస్తాయి.

అంతేగాక హృదయ సంబంధ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. పాటు వీటిలోని ఫ్లెవనాయిడ్స్‌, మినరల్స్‌, పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మంచివి. అదే విధంగా బొబ్బర్లలో ఉండే ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. మలబద్దకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బొబ్బర్లోని అధిక ప్రోటీన్‌ కంటెంట్‌ చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది. చర్మ రంధ్రాలు తెరుచుకునేలా చేస్తుంది. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌ ఏ, సీ చర్మ కణాలను రక్షిస్తాయి.

Next Story