తెల్లజుట్టు అనారోగ్య సంకేతమా..? చిట్కాలు ఇవే

ఒకప్పుడు 40 ఏళ్లు దాటిన తర్వాత తెల్లజుట్టు కనిపించేది. ప్రస్తుతం పాతికేళ్లు దాటితే చాలు చాలా మందిలో తెల్లజుట్టు కనిపిస్తోంది.

By అంజి  Published on  30 Jan 2024 8:15 AM GMT
Health, gray hair, gray hair tips, Lifestyle

తెల్లజుట్టు అనారోగ్య సంకేతమా..? చిట్కాలు ఇవే

ఒకప్పుడు 40 ఏళ్లు దాటిన తర్వాత తెల్లజుట్టు కనిపించేది. ప్రస్తుతం పాతికేళ్లు దాటితే చాలు చాలా మందిలో తెల్లజుట్టు కనిపిస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కొందరు ఇది శరీరంలో ఏదైనా వ్యాధికి సంకేతమా? అని భయపడుతుంటారు. అయితే జుట్టు తెల్లబడటం అనారోగ్య సమస్యగా పరిగణించాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జుట్టు సంరక్షణ కోసం కొన్ని రకాల రసాయనాలతో తయారు చేసిన షాంపూలు, హెయిర్‌ ఆయిల్స్‌ అతిగా వాడటం వల్ల జుట్టు తెల్లబడుతున్నట్టు కొన్ని పరిశోధనల్లో తేలింది.

కొన్ని షాంపూల్లో అధిక మొత్తంలో సల్ఫేట్‌ సంబంధిత పదార్థాలు వాడటం వల్ల జుట్టు పొడి బారి, రాలిపోవడం, నెరిసిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్టు తేలింది. అందువల్ల సల్ఫేట్‌ని, అతితక్కువగా ఉన్న హెయిర్‌ ఆయిల్స్‌, షాంపూలు వాడటం ఉత్తం. షాంపులో ఓమేగా-3, ఓమేగా - 6, బయోటిన్‌, కెరోటిన్‌ వంటి పదార్థాలు ఉండేలా చూసుకోండి. వీటి వల్ల మీ హెయిర్‌ గ్రోత్‌ బాగుంటుంది. జుట్టు సమస్యలు రావు. అలాగే మన శరీరంలో విటమిన్‌ బీ12, విటమిన్‌ డీ లోపం, మెలనిన్‌ ఉత్పత్తి తగ్గిపోవడం, థైరాయిడ్‌ సమస్యలు, ధూమపానం, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వల్ల కూడా జుట్టు నెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

తెల్లజుట్టును నివారించే చిట్కాలు

గుడ్డులో ప్రోటీన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు తెల్లబడకుండా చేస్తుంది. తెల్లజుట్టు సమస్య ఉంటే రోజువారీ ఆహారంలో గుడ్డును భాగం చేసుకోండి.

పెరుగులో విటమిన్‌బి-12 ఉంటుంది. ఇది జుట్టును నల్లగా ఉంచడంతో సహాయపడుతుంది.

నల్లనువ్వులకు మెలనిన్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. నల్లనువ్వులు లేదా నువ్వుల చిక్కీ, నువ్వుల లడ్డూ వంటిని రోజూ తింటే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. వీటిలో ఉండే కాల్షియం, ఐరన్‌ ఎముకలకు బలాన్నిచ్చి, రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తాయి.

ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌-సి ఉంటాయి. నెరిసిన జుట్టును నల్లగా మార్చడంలో ఉసిరి సహాయపడుతుంది. ఉసిరిని ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

నల్ల ఎండు ద్రాక్షలో విటమిన్లు, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. చిన్న వయసులో జుట్టు నెరిసిపోవడాన్ని ఇవి నివారిస్తాయి. రోజూ కొన్ని నానబెట్టిన లేదా నల్ల ఎండుద్రాక్ష లేదా తాజా నల్ల ద్రాక్ష తింటే జుట్టు నల్లగా మారుతుంది.

Next Story