తాటి ముంజలు తింటే.. కలిగే బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

వేసవిలో లభించే తాటి ముంజలను తినడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. ఇవి తింటే ఎండ తాపం నుంచి ఉపశమనంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

By అంజి
Published on : 24 April 2024 2:15 PM IST

ice apples, health, Lifestyle

తాటి ముంజలు తింటే.. కలిగే బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ప్రజలు రకరకాల జ్యూస్‌లు, శీతల పానీయాలు, మజ్జిగ, కొబ్బరి నీరు, చెరుకు రసం తాగుతుంటారు. అయితే వీటితో పాటు వేసవిలోనే మనకు లభించే తాటి ముంజలను తినడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. ఇవి తింటే ఎండ తాపం నుంచి ఉపశమనంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

గ్రామాల్లో తాటిచెట్లు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ చాలా మందికి ముంజలు దొరుకుతాయి. పట్టణాల్లో ధర ఎక్కువైనా సరే వాటిని కొనుక్కుని చాలా మంది తింటుంటారు. అసలు ఈ తాటి ముంజలతో ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..

ముంజల్లో ఐరన్‌, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌ ఏ,బి, సిలతో పాటు జింక్‌, పొటాషియం, ఫాస్పరస్‌లు అధికంగా ఉంటాయి. వేసవిలో రోజూ తాటి ముంజలు తింటే వడదెబ్బ తగలకుండా బయటపడవచ్చు. తాటి ముంజలు వేసవి వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి బరువును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. మలబద్ధకం, విరేచనాల సమస్యలకు ఇది నివారిణిగా పని చేస్తుందని చెబుతారు.

డీహైడ్రేషన్‌కు గురైన వారు ముంజలు తింటే దాహం తీరి ఉపశమనం లభిస్తుంది. రక్తహీనత ఉన్నవారు ముంజలు తింటే మంచి ఫలితాలు ఉంటాయి. ఎండవేడి వల్ల వచ్చే పొక్కులు, చర్మ వ్యాధులు, దద్దుర్లు తగ్గుతాయి. కాలేయ సమస్యలకు, అజీర్ణ సమస్యలకు ముంజకాయ మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గర్ణిణుల జీర్ణక్రియను ముంజలు మెరుగుపరుస్తాయి. ఎసిడిటీ సమస్యను దూరం చేస్తాయి.

Next Story