చలికాలంలో మేలు చేసే మెంతి కూర

ఆకు కూరలను మన ఆహారంలో భాగం చేసుకుంటే వాటి వల్ల చక్కని ఆరోగ్యం మన సొంతం అవుతుంది.

By అంజి  Published on  20 Nov 2024 11:30 AM IST
health benefits, fenugreek, winter

చలికాలంలో మేలు చేసే మెంతి కూర

ఆకు కూరలను మన ఆహారంలో భాగం చేసుకుంటే వాటి వల్ల చక్కని ఆరోగ్యం మన సొంతం అవుతుంది. వీటిలో శరీరానికి అవసరమైన భాస్వరం, పొటాషియం, సోడియం, జింక్‌, కాల్షియం, ఇనుము వంటి ఖనిజ లవణాలు, ఎ,బీ,సీ,కె వంటి విటమిన్‌లు పుష్కలంగా లభిస్తాయి. శీతాకాలంలో అనేక ఇన్ఫెక్షన్లు, ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటికి మెంతికూర చక్కని పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు.

ప్రయోజనాలు:

మెంతి కూరలో ప్రోటీన్లు, కొవ్వులు, కార్బొహైడ్రేట్లు, ఐరన్‌, కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, జింక్‌, కాపర్లు ఉంటాయి. అలాగే విటమిన్‌ ఏ,బీ,సీ,డీలు ఉంటాయి.

శీతాకాలంలో అజీర్తి, గ్యాస్‌, పొట్టలో ఉబ్బరం వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వారానికి రెండుసార్లు మెంతి కూర తింటే కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మెంతి కూరలో పీచు పదార్థం జీవక్రియను పెంచుతుంది. దీని వల్ల క్యాలరీలు కరిగి బరువు తగ్గే అవకాశం ఉంటుంది. మెంతి కూరను ఆహారంగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. దీన్ని తినడం వల్ల టైప్‌ 2 డయాబెటిస్‌ ముప్పు తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

Next Story