పచ్చిగా తినే కూరగాయలు, తినకూడని కూరగాయలు ఇవే
కొన్ని రకాల పచ్చి కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. మన రోజు వారీ డైట్‌లో కొన్ని రకాల పచ్చి కూరగాయలను తినడం అలవాటు చేసుకోవాలి.
By అంజి Published on 13 Oct 2023 11:15 AM ISTపచ్చిగా తినే కూరగాయలు, తినకూడని కూరగాయలు ఇవే
పచ్చిగా తినే కూరగాయలు ఇవే
కొన్ని రకాల పచ్చి కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. మన రోజు వారీ డైట్‌లో కొన్ని రకాల పచ్చి కూరగాయలను తినడం అలవాటు చేసుకోవాలి. పలు కూరగాయలను వండకుండా తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవెంటో ఇప్పుడు చూద్దాం.. క్యారెట్.. ఈ జాబితా ముందు ఉంటుంది. పచ్చి క్యారెట్‌ని తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే చర్మ సౌందర్యం కూడా మెరుగవుతుంది.
బీట్‌రూట్‌ని కూడా పచ్చిగా తినడం వల్ల గుండె, ఊపిరితిత్తులకు ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల రక్తం పెరగడంతో పాటు విటమిన్ - బి పుష్కలంగా లభిస్తుంది. బీట్‌రూట్‌ని జ్యూస్ చేసుకుని కూడా తాగొచ్చు. పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. ఉల్లిపాయల్లో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
బ్రోకలీని కూడా పచ్చిగానే తినాలి. ఇందులో ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీనిలో ఉండే సీ విటమిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూరని జ్యూస్ చేసుకుని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ఇలా కూరగాయలను పచ్చిగా తినడం వల్ల శరీరానికి ఎక్కువ మొత్తంలో మినరల్స్, విటమిన్‌లు అందుతాయి.
పచ్చిగా తినకూడని కూరగాయలు ఇవే
చేమదుంపల ఆకులను సలాడ్ రూపంలో మంచిది కాదు. ఈ ఆకులను పచ్చిగా తినకూడదట. దీనిలో ఉండే ఆక్సేలిక్ యాసిడ్ వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆకులను ఉడకపెట్టి తినడం వల్ల ఆక్సేలిక్ యాసిడ్ తగ్గిపోతుంది. ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. దీంతో పాటు చాలా మృదువుగా, ఆకర్షణీయంగా కనిపించే క్యాబేజీలో టేప్‌వార్మ్స్ ఉండే అవకాశముంది. అందువల్ల పచ్చి క్యాబేజీ ఆకులను తింటే అజీర్తి, విరోచనాలు వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
క్యాప్సికంను తినేటప్పుడు గింజలను తొలగించి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలా సార్లు క్యాప్సికం గింజల్లో తెలియకుండానే టేప్‌వార్మ్స్ గుడ్లు ఉంటాయి. ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తే అనేక రకాల సమస్యలను కలగజేస్తాయి. అందువల్ల క్యాప్సికంపై భాగాన్ని మాత్రమే తినాలని సలహా ఇస్తున్నారు. పచ్చివంకాయలను తినవద్దని.. వీలైనంత వరకు ఉడకపెట్టి లేదా కూర చేసుకొని మాత్రమే తినమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. వంకాయ గింజల్లో టేప్‌వార్మ్ గుడ్లు ఉండే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.