మనం రోజూ తయారు చేసే అనేక ఆహార పదార్థాల్లో పంచదార భాగమైపోయింది. ఉదయం టీ లేదా కాఫీ తయారీ నుంచి రాత్రి పడుకునే వరకు తినే పదార్థాల్లో ఇది ఉండాల్సిందే. పంచదార వల్ల మనకు కలిగే లాభం కన్నా.. అతిగా తీసుకుంటే వచ్చే నష్టమే ఎక్కువ. చక్కెరను పూర్తిగా పక్కన పెట్టినా ఎలాంటి నష్టం ఉండదని పైగా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
చక్కెర ఉన్న పానీయాలు, స్వీట్లు, ఇతర పదార్థాలను తినడం మానేస్తే శరీరంలోకి అధికంగా చేరే కేలరీల పరిమాణం తగ్గుతుంది. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. చక్కెరను దూరం పెట్టడం వల్ల హైబీపీ, గుండె జబ్బులు సహా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పు తగ్గుతుంది. నోటి ఆరోగ్యం, దంత సంరక్షణ కోసం చక్కెరను దూరం పెట్టడం చాలా మంచిది.
చక్కెరతో కూడిన ఆహార పదార్థాలను దూరం పెడితే నోటీ సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. చక్కెర తినడం మానేయడం వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా చాలా తగ్గుతుంది. మూడ్ స్వింగ్స్, చిరాకు, కోపం తగ్గుతుంది. చర్మం త్వరగా ముడతలు పడటం తగ్గి కాంతివంతంగా మారుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపుబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.