పిల్లలకు ఇంకా మాటలు రావట్లేదా? ఇలా చేయండి

సాధారణంగా పిల్లలు పుట్టిన కొన్ని నెలలు గడిచాక వాళ్లు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా? అని తల్లిదండ్రలతో పాటు కుటుంబ సభ్యులంతా ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు.

By అంజి  Published on  30 Aug 2024 1:25 PM IST
kids talking, speechless, child, Lifestyle

పిల్లలకు ఇంకా మాటలు రావట్లేదా? ఇలా చేయండి

సాధారణంగా పిల్లలు పుట్టిన కొన్ని నెలలు గడిచాక వాళ్లు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా? అని తల్లిదండ్రలతో పాటు కుటుంబ సభ్యులంతా ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. వారు పలికే ముద్దులొలికే చిన్న చిన్న మాటలు వింటూ తెగ సంబరపడిపోతారు. అయితే కొందరు పిల్లలు రెండు, మూడేళ్లు వచ్చినా చిన్న చిన్న పదాలు తప్ప పెద్దగా మాట్లాడరు. దీంతో వారికి ఏదో లోపం ఉందని తల్లిదండ్రులు భావిస్తారు. అయితే ఆ సమస్యకు కారణం తల్లిదండ్రులు కూడా కారణం అని తెలుసుకోవాలి. మరి ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

తమ వృత్తి పనుల్లో భాగంగా కొందరు పేరెంట్స్‌ చిన్న పిల్లలతో మాట్లాడటానికి సమయం కేటాయించరు. పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు మాట్లాడే పదాలు విని మాటలు నేర్చుకుంటారు. కాబట్టి వీలైనంత సమయం వారితో గడిపి చిన్న చిన్న మాటలు, కథలు, ఇతర విషయాలు చెప్తూ ఉంటే.. వారు కూడా స్పందించి నెమ్మదిగా మీతో మాట్లాడతారు.

అలాగే పిల్లలు మాట్లాడేటప్పుడు మధ్యలో ఆపే ప్రయత్నం చేయొద్దు. మొత్తం విని వారు ఆపాక మాత్రమే మాట్లాడాలి. తమ వయసు ఉండే వారితో చిన్న పిల్లలను ఆడుకోనివ్వాలి. అప్పుడు వారి నుంచి కొత్త విషయాలు, పదాలు గ్రహించి క్రమంగా మాట్లాడుతారు. ఒకవేళ మూడేళ్లు దాటిన తర్వాత కూడా చిన్న పిల్లలు మాట్లాడకుంటే డాక్టరుకు చూపించాలి.

Next Story