శరీరంలో వేడిని తగ్గించే ఆహారాలు ఇవే..
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. అదీకాక ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో శరీర ఉష్ణోగ్రత సైతం పెరుగుతోంది.
By అంజి Published on 15 May 2024 9:15 PM ISTశరీరంలో వేడిని తగ్గించే ఆహారాలు ఇవే..
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. అదీకాక ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో శరీర ఉష్ణోగ్రత సైతం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ఆహారం, పానీయాలు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ ఆహారం, పానీయాలు ఎంటో చూద్దామా!
కొబ్బరి నీళ్లు, మజ్జిగ
శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో కొబ్బరి నీళ్లు, మజ్జిగ బాగా పని చేస్తాయి. కొబ్బరి నీళ్లు తీసుకుంటే బాడీ హైడ్రేట్ అయ్యి ఎలక్ట్రోలైట్స్ సమతుల్యం అవుతాయి. మజ్జిగ తాగడం వల్ల వేడి తగ్గడంతో పాటు జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి.
కలబంద, పుదీన
కలబంద సహజ కూలింగ్ ఏజెంట్. కలబంద జెల్‌ను చర్మానికి రాసుకోవడం, కలబంద రసం తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే పుదీన శరీరాన్ని చల్లబరిచే కూలింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది.
నిమ్మరసం, ఉల్లిపాయ
నిమ్మరసంలో విటమిన్ సీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. నిమ్మరసం తాగితే శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయలో క్వెర్సిన్ అధికంగా ఉంటుంది. ఇది వడదెబ్బ నుంచి రక్షిస్తుంది.
పుచ్చకాయ, కీరదోస
92 శాతం నీరు ఉండే పుచ్చకాయ తింటే.. శరీరంలో నీటి స్థాయి పెరిగి ఉష్ణోగ్రత కంట్రోల్‌లో ఉంటుంది. అలాగే కీరదోసలో కూడా నీటి మోతాదు ఎక్కువగా ఉంటుంది. కీరదోస తింటే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. పల్నాడు జిల్లాలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణలు ఇంకా సద్దుమణగలేదు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం, పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.