భోజనం తర్వాత మనం చేసే కొన్ని పనులు పలు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. ఈ కింద సూచించిన కొన్ని పనులను భోజనం చేసిన వెంటనే చేస్తుంటే వాటిని మానుకోవడానికి ప్రయత్నించండి. తిన్న తర్వాత ధూమపానం చేస్తే జీర్ణక్రియ దెబ్బతింటుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందట. భోజనం చేసిన వెంటనే వ్యాయామాలు చేయడం మంచిది కాదు. దీని వల్ల జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణపై ప్రభావం పడి ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
తిన్న వెంటనే పడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువ. తిన్న తర్వాత టీ తాగడం వల్ల జీర్ణాశయంలో యాసిడ్ అధికంగా రిలీజై అజీర్తి సమస్యలకు కారణం అవుతుంది. భోజనం తర్వాత వెంటనే నీళ్లు ఎక్కువగా తాగకూడదు. దీని వల్ల కడుపులోని ఆమ్లాలు, జీర్ణక్రియకు అవసరమయ్యే ఎంజైమ్‌లు కరిగిపోయి తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. తిన్న వెంటనే స్నానం చేస్తే జీర్ణ వ్యవస్థ పని తీరు దెబ్బతింటుంది.