'దానిమ్మ' పండు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

అప్ఘానిస్తాన్‌లో పుట్టి ప్రపంచమంతా విస్తరించిన పండు.. దానిమ్మ. అన్ని కాలాల్లోనూ లభించే ఈ పండును మన డైట్‌లో చేర్చుకుంటే,

By అంజి  Published on  14 April 2023 1:45 PM IST
pomegranate fruit, Life style, Health Benfits

'దానిమ్మ' పండు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

అప్ఘానిస్తాన్‌లో పుట్టి ప్రపంచమంతా విస్తరించిన పండు.. దానిమ్మ. అన్ని కాలాల్లోనూ లభించే ఈ పండును మన డైట్‌లో చేర్చుకుంటే, ఎన్నో ఆరోగ్య సమస్యలు దరిచేరవు. తియ్యతియ్యగా ఉండే దానిమ్మ పండు.. రుచిని పంచడంలోనే కాదు పోషకాలనూ అందిస్తాయి. వాటిలో కొన్ని మీ కోసం..

100 గ్రాముల దానిమ్మ గింజల్లో పిండి పదార్థం 14 గ్రామాలు, కొవ్వు 0.1 గ్రాము, మాంసకృత్తులు 1.6 గ్రాములు, కాల్షియం 10 మిల్లీ గ్రాములు, ఫాస్పరస్ 70 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 12 మిల్లీ గ్రాములు, ఐరన్ 0.3 మిల్లీ గ్రాములు, సోడియం 4 మిల్లీ గ్రాములు, పోటాషియం 171 మిల్లీ గ్రాములు, పీచు 5.1 మిల్లీ గ్రాము ఉంటుంది.

ఉపయోగాలు

- దానిమ్మ రక్తంలోని మలినాలను తొలగించి, రక్తశుద్ధి చేస్తుంది.

- మొటిమలున్న వారు సున్నిపిండిలో దానిమ్మ రసాన్ని కలుపుకుని ముఖానికి పట్టించి కడిగితే సమస్య తొలగిపోతుంది.

- తియ్య దానిమ్మ పండ్లు టీబీ, ఉబ్బసము, రక్తక్షీణత, కిడ్నీల వాపు, చర్మ, జీర్ణ సమస్యలకు చెక్‌ పెడుతుంది.

- దానిమ్మ గింజలు తింటే ఒత్తిడి, చిరాకు తగ్గి మానసికోల్లాసం కలుగుతుంది.

- దానిమ్మ గింజలు తినడం వల్ల చిగుళ్లు గట్టిపడటం, నోరు, గొంతులోని పుండ్లు నయమవుతాయి.

- పుల్లదానిమ్మ గర్భవతులకు కలిగే వేవిళ్లను, రక్త క్షీణతను నివారిస్తుంది.

- దానిమ్మ గింజలు తినే వారి జీర్ణశక్తి బాగుంటుంది. నులి పురుగుల సమస్య దూరమవుతుంది.

Next Story