మార్కెట్‌లో మనకు లభించే స్వీట్‌కార్న్ నోటికి మంచి రుచితో పాటు మనకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఆహారంలో స్వీట్‌కార్న్‌ని చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని, దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.
ఉపయోగాలు:
స్వీట్‌కార్న్‌లో ఫైబర్ సహా మన శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, బీ కాంప్లెక్స్, సీతో పాటు పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. స్వీట్ కార్న్‌లో ఉండే లుటీన్, జియాక్సాంటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కంటి సంబంధిత వ్యాధులను నిరోధించడంలో సహాయపడతాయి. స్వీట్‌కార్న్‌లో పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నిరోధిస్తుంది.
స్వీట్‌కార్న్‌లో ఫైబర్ వల్ల కొంచెం తిన్నా కడుపు నిండిన ఫీల్ కలుగుతుంది. దీంతో ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి స్వీట్‌కార్న్ తినడం వల్ల బరువు తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్వీట్ కార్న్‌ను ఎక్కువ బటర్, ఉప్పు, నూనెతో కలిపిన పదార్థాలతో తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీన్ని ఉడికించి నేరుగా తీసుకోవడం మంచిది.