ప్రస్తుతం ఇళ్లలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం బాగా పెరిగింది. తక్కువ ధరకు, కావాల్సిన డిజైన్లలో దొరకడం వల్ల ప్రజలు వీటిని వాడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వీటి విస్తృత వినియోగం పర్యావరణానికి, మన ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి బదులు రాగి పాత్రలను, గాజు బాటిళ్లను వాడాలని సూచిస్తున్నారు. మంచి నీరు తాగడానికి కూడా ఎక్కువగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారు. వాటికి బదులు నీటిని రాగి పాత్రలలో ఉంచి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
నీటిలో హానికరమైన బ్యాక్టీరియాను చంపే లక్షణం రాగికి ఉంటుంది. రాగి బాటిల్‌లో ఉంచిన నీటిని తాగితే ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అల్సర్లు, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు పరిష్కారమవుతాయని నిపుణులు చెబుతున్నారు. కాలేయం, మూత్రపిండాల పనితీరు బాగుంటుందని, ముఖంపై మొటిమలు, చర్మంపై పగుళ్లు వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది. అందుకే అవకాశం ఉంటే ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీటిని తాగడం మాని రాగి బాటిల్‌లో తాగడం ఆరోగ్యానికి మంచిది. అయితే ఈ బాటిల్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం మరచిపోవద్దు.