బ్లాక్ కిస్మిస్‌తో ప్రయోజనాలెన్నో!
Health Benefits of Black Raisins. బ్లాక్ కిస్మస్ ..కేవలం రుచికే కాదు... ఆరోగ్యపరంగా అత్యద్భుత ప్రయోజనాలున్నాయి. బ్లాక్ కిస్మస్‌తో కలిగే
By అంజి Published on 22 Jan 2023 5:03 PM IST
బ్లాక్ కిస్మస్ ..కేవలం రుచికే కాదు... ఆరోగ్యపరంగా అత్యద్భుత ప్రయోజనాలున్నాయి. బ్లాక్ కిస్మస్‌తో కలిగే ఆ అద్భుత ప్రయోజనాలంటనేది తెలుసుకుందాం
*ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ బ్లాక్ కిస్మస్ తింటే చాలా మంచిది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. సాధారణ కిస్మస్‌తో పోలిస్తే..బ్లాక్ కిస్మస్‌లో అధిక ఔషధ గుణాలుంటాయి.
*బ్లాక్ కిస్మస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి. కంటిచూపును పెంచడంతో యాంటీ ఆక్సిడెంట్లు దోహదపడతాయి. కళ్లలోని కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది.
*బ్లాక్ కిస్మస్‌తో రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఫలితంగా హైబీపీ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో అధికంగా ఉండే విటమిన్ సి కారణంగా జుట్టు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. తలలో చుండ్రు కూడా తగ్గుతుంది.
*బ్లాక్ కిస్మస్‌లో పొటాషియం, కాల్షియం అధికంగా ఉండటంతో ఎముకలు ధృడంగా ఉంటాయి. ఆస్టియో పోరోసిస్, ఆర్ధరైటిస్ సమస్యలున్నవారు ప్రతిరోజూ కిస్మస్ తింటే చాలా మంచిది. అంతేకాకుండా శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా దోహదపడతాయి
*ముఖ్యంగా బ్లాక్ కిస్మస్‌లో ఉండే విటమిన్లు, మినరల్స్ శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. ఇందులో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచేందుకు దోహదపడుతుంది. అధిక బరువును తగ్గించుకోవడంలో బ్లాక్ కిస్మస్ బాగా ఉపయోగపడుతుంది.