ఆహారం బాగా నమిలి తినడం వల్ల అది మెత్తగా మారి జీర్ణాశయంలోకి వెళుతుంది. అప్పుడు జీర్ణ వ్యవస్థపై తక్కువ భారం పడుతుంది. తిన్నది త్వరగా జీర్ణమవుతుంది. ఆహారం బాగా నమలడం వల్ల నాలుకకు రుచి తెలుస్తుంది. ఆ ప్రభావం మెదడు మీద పడి శరీరానికి మేలు చేసే హార్మోన్ల విడుదలకు సాయపడుతుంది. ఆహారం హడావుడిగా తింటే గాలి కూడా లోపలికి వెళ్లి.. భోజనం చేసిన కాసేపటికే మళ్లీ ఆకలి వేస్తుంది. అందుకే బాగా నమిలి తింటే ఈ పరిస్థితి రాదు.
ఆహారం బాగా నమిలి తినడం వల్ల దంతాలు గట్టిపడతాయి. ముఖ కండరాలకు మంచి వ్యాయామం జరిగి అక్కడ కొవ్వు చేరకుండా ఉంటుంది. నమిలి తినడం వల్ల ఆహారంలో ఉండే పోషకాలు త్వరగా శరీరానికి అందుతాయి. ఆహారాన్ని బాగా నమలడం వల్ల, నోట్లో లాలాజలం ఎక్కువగా విడుదల అవుతుంది. ఈ లాలాజలంలో ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైములు ఉంటాయి. దీంతో ఆహారం తక్కువ సమయంలో జీర్ణం అవుతుంది.