మతిమరుపు సమస్య బాధిస్తోందా?.. ఇలా జ్ఞాపకశక్తిని పెంచుకోండి.!
మారిన జీవనశైలి కారణంగా చాలా మందిలో మతిమరుపు సమస్య తలెత్తుంది. సాధారణంగా వయస్సు మీద పడుతున్న కొద్దీ వచ్చే
By అంజి Published on 23 April 2023 7:45 AM GMTమతిమరుపు సమస్య బాధిస్తోందా?.. ఇలా జ్ఞాపకశక్తిని పెంచుకోండి.!
మారిన జీవనశైలి కారణంగా చాలా మందిలో మతిమరుపు సమస్య తలెత్తుంది. సాధారణంగా వయస్సు మీద పడుతున్న కొద్దీ వచ్చే ఈ మతిమరుపు సమస్య.. కొందరిలో 40 ఏళ్ల నుంచే మొదలవ్వొచ్చు. ఈ సమస్య నుంచి బయటపడి జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. అవి ఏంటో ఓ సారి చూద్దాం..
సమతుల ఆహారం తీసుకోవాలి
పాలు, పెరుగు, పండ్లు, ఉడికించిన కోడిగుడ్డు నిత్యం మీ ఆహారంలో భాగమయ్యేలా చూసుకోవాలి. తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉండేలా చూసుకోవాలి. అధిక కొవ్వులు, అధిక కార్బొహైడ్రేట్లకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్, ధూమపాన మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పైగా ఇది మెదడుని కన్ఫ్యూజన్ చేసి మతిమరుపును పెంచుతుంది. కాబట్టి ఈ రెండింటికి దూరంగా ఉండాలి. శరీరానికి శ్రమ లేకుండా రోజును గడిపితే అది మతిమరుపుకు దారితీస్తుంది. అందుకే వ్యాయామం, శారీరక శ్రమ లాంటివి ప్రతిరోజూ చేస్తూ ఉండాలి.
అందరితో కలిసిపోవాలి
కొందరు ఉద్యోగ, వృత్తిగతమైన జీవితంలో బీజీగా ఉండి బంధువులు, స్నేహితులను కూడా పట్టించుకోరు. అది మెదడు పనితీరుకు ఏమాత్రం మంచిది కాదు. తరచూ బంధువుల, స్నేహితులను కలుస్తూ సాంఘిక జీవనానికి దగ్గర కావడం అలవాటు చేసుకుంటే మెదడు పనితీరు మెరుగవుతుందని తెలుసుకోవాలి.
కాసేపు టెన్షన్లను పక్కనపెట్టాలి
మెదడు చురుగ్గా పని చేసేందుకు కాసేపు టెన్షన్లను పక్కనపెట్టాలి. దీని కోసం పుస్తక పఠనం, పజిల్స్, క్లాసికల్ మూవీస్ చూడటం, చిన్న పిల్లలతో గేమ్స్ ఆడడం, ఇలా ఏవైనా ఒత్తిడి లేకుండా కూల్‌గా ఉండేందుకు, మానసికంగా చరుగ్గా ఉండే అలవాట్లను ఎంచుకోవాలి. ఇలా అనేక వ్యాపకాలతో మతిమరుపు, సమస్యకు క్రమంగా దూరమవ్వొచ్చు.