హోళీ రంగులు చల్లుకుంటున్నారా?.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి
హోళీ అంటేనే రంగుల పండుగ. కలర్స్ ఒకరిపై ఒకరు చల్లుకునే సమయంలో కళ్లలో పడకుండా కళ్లద్దాలు పెట్టుకోవడం ఉత్తమం.
By అంజి
హోళీ రంగులు చల్లుకుంటున్నారా?.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి
హోళీ అంటేనే రంగుల పండుగ. కలర్స్ ఒకరిపై ఒకరు చల్లుకునే సమయంలో కళ్లలో పడకుండా కళ్లద్దాలు పెట్టుకోవడం ఉత్తమం. కృత్రిమ రంగులు కాకుండా ఆర్గానిక్ రంగులను ఉపయోగించేలా చూడండి. శరీరానికి నూనె అప్లై చేయడం ద్వారా రంగులను త్వరగా శుభ్రం చేసుకోవచ్చు. రంగులు శరీరంపై పడకుండా ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించండి. చెరువులు, కాలువలు, జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండటం ఉత్తమం. ముఖ్యంగా పసుపు, కుంకుమ, సహజ సిద్ధమైన రంగులతో హోళీ ఆడితే చర్మం సురక్షితంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆర్టిఫిషియల్ రంగుల్లో వాడే సబ్‌స్టెన్స్‌తో కళ్లు, చర్మ వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. హోళీ ఆడేటప్పుడు సింథటిక్ రంగుల నుంచి కళ్లను కాపాడుకునేందుకు కళ్లజోడు ధరించండి. రంగుల్లో ఉండే రసాయనాల నుంచి కళ్లకు రక్షణ కల్పిస్తుంది. హోలీ ఆడేటప్పుడు కళ్లలో రంగులు పడితే.. వెంటనే కళ్లను రుద్దకండి. ఇది ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. కాబట్టి, కళ్లను శుభ్రమైన నీటితో కడగాలి. ఇందుకు రోజ్ వాటర్ సమర్థంగా పనిచేస్తుంది. కాంటాక్ట్ లెన్స్ వాడేవాళ్లు.. వాటిని తొలగించి హోలీ ఆడుకోండి. రంగుల్లో ఉండే రసాయనాలు లెన్స్‌లో చిక్కుకొని.. చికాకు, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి.
దేశ వ్యాప్తంగా హోళీ సంబరాలు జరుగుతున్నాయి. ప్రజలు తెల్లవారుజాము నుంచే రంగులు చల్లుకుంటున్నారు. ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ శూభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. అటు హైదరాబాద్ నగరంలో హోళీ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా ఎవరిపై రంగులు చల్లవద్దని స్పష్టం చేశారు. రేపు ఉదయం 6 గంటల వరకు ఈ రూల్ అమల్లో ఉంటుందని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.