గుడ్లు తింటే ఆరోగ్యమే.. కానీ అతిగా తింటే..

ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒక గుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.

By అంజి  Published on  25 Oct 2024 4:30 AM GMT
Eating, eggs, health

గుడ్లు తింటే ఆరోగ్యమే.. కానీ అతిగా తింటే..

ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒక గుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. గుడ్డులో ఉండే ప్రోటీన్స్‌, విటమిన్స్, ఇతర పోషకాలే దీనికి కారణం. అందుకే రోజూ ఒక గుడ్డు తినండి అని ప్రభుత్వం కూడా ప్రచారం చేయడంతో పాటు అంగన్వాడీల్లో గర్భిణులు, చిన్నారులకు గుడ్లను అందిస్తోంది. ఆరోగ్యానికి మేలు చేసేవి అయినా గుడ్లను అతిగా తినడం వల్ల హాని తప్పదంటున్నారు డైటీషియన్లు.

ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు ఒక గుడ్డు చొప్పున వారానికి ఏడు నుంచి 10 గుడ్లను మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే వ్యాయామం చేసేవారు, అథ్లెట్లకు ఈ నియమం వర్తించదు. వారు ఎక్కువగా శారీరక శ్రమ చేస్తుంటారు కాబట్టి వారికి ఎక్కువ పోషకాహారం అవసరం. అందుకే వారు ట్రైనర్ల సూచన మేరకు రోజుకు 4 నుంచి 5 గుడ్లు వరకూ తినొచ్చట. డయాబెటిస్‌, హైబీపీ, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వైద్యుల సూచన మేరకు మాత్రమే గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Next Story