రాత్రి నిద్ర పట్టట్లేదా.. అయితే ఈ ఆహారం తీసుకోండి?

Eating these foods will help you sleep better at night. మంచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎంత అవసరమో, అదే విధంగా గాఢ నిద్ర కూడా

By అంజి  Published on  22 Feb 2023 6:02 AM GMT
రాత్రి నిద్ర పట్టట్లేదా.. అయితే ఈ ఆహారం తీసుకోండి?

మంచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎంత అవసరమో, అదే విధంగా గాఢ నిద్ర కూడా చాలా ముఖ్యం. నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పూర్తి నిద్ర కారణంగా మీ అవయవాలు సరిగ్గా పని చేస్తాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అనేక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. రాత్రిపూట నిద్రించడానికి ఇబ్బందులు పడే వారు చాలా మంది ఉన్నారు. నిద్రలేమి కూడా ఊబకాయం, బరువు పెరగడం, చిత్తవైకల్యం వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. ఒక వ్యక్తి రాత్రిపూట తప్పనిసరిగా 7 నుండి 8 గంటలు నిద్రపోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే మీకు రాత్రి త్వరగా నిద్ర పట్టకపోతే.. రాత్రి పడుకునే ముందు ఈ భోజనం చేయడం వల్ల మంచి నిద్రపోతారు.

నట్స్‌: నట్స్ మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడతాయి. వీటిలో చాలా రకాల అవసరమైన విటమిన్లు. మినరల్స్ లభిస్తాయి. దీని కారణంగా మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. నట్స్‌ తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో మెలటోనిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మంచి నిద్రకు దారితీస్తుంది.

చామంతి టీ: చామంతి టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, ఇది ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం.. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడులోని గ్రాహకాలను ప్రోత్సహిస్తాయి. ఇది మీ నిద్రను నియంత్రిస్తుంది. నిద్రలేమి సమస్యను అధిగమిస్తుంది.

రైస్‌: ప్రపంచవ్యాప్తంగా రైస్‌ని పెద్ద పరిమాణంలో వినియోగిస్తారు. రైస్‌లో పీచు, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రైస్‌లో పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇందులో జీఐ సూచిక కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రాత్రి పడుకునే ఒక గంట ముందు అన్నం తింటే నిద్ర బాగా పడుతుంది.

చెర్రీస్: చెర్రీస్‌లో మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం యొక్క అంతర్గత చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. నిద్రపోయే ముందు కొన్ని చెర్రీస్ తీసుకోవడం వల్ల మంచి నిద్ర రావడానికి సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. చెర్రీలను జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు లేదా తాజా చెర్రీస్ అందుబాటులో లేకపోతే.. డ్రై చెర్రీస్ కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.

పాలు: రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. పాలలో ఉండే ట్రిప్టోఫాన్, సెరోటోనిన్ మంచి నిద్రకు ఉపకరిస్తాయి.

Next Story