వేసవిలో ఈ రకమైన ఆహారం తీసుకోవడం ఉత్తమం
ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత పెరుగుతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు.
By అంజి Published on 23 April 2023 2:45 PM ISTవేసవిలో ఈ రకమైన ఆహారం తీసుకోవడం ఉత్తమం
ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత పెరుగుతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వేసవిలో తేలికపాటి ఆహారం, నీటిశాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం.
తేలికపాటి ఆహారం తీసుకోండి
వేసవిలో సాధ్యమైనంతవరకు నూనెతో తయారు చేసిన పదార్థలకు దూరంగా ఉండాలి. జంక్‌ఫుడ్ వంటి వాటికి జోలికి వెళ్లొద్దు. తేలికపాటి ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ సమయంలో బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. బయట వేడి ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలు, పెద్దలు బయటకు వెళ్లొద్దు. వేడికి తట్టుకునేందుకు నూనెలేని, తేలికపాటి ఆహారాన్ని తినాలి. డీఫ్రిజ్‌లో ఉన్న వాటిని తీసుకుని వెంటనే తినడం, తాగడం చేయకూడదు. గది ఉష్ణోగ్రత కంటే కొంచెం చల్లగా ఉన్న వాటిని మాత్రమే తీసుకోవడం ఉత్తమం. బాగా చల్లగా ఉన్న నీరు, ఆహార పదార్థాలు తినొద్దు. అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. కూల్‌డ్రింక్స్ దూరంగా ఉండాలి. వీలైతే పండ్లరసాలు తాగడం మంచిది.
తీసుకునే ఆహారంలో నీటిశాతం ఎక్కువగా ఉంటే ఎంతో మేలు
ఈ వేసవిలో నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. కీరదోస, పుచ్చకాయ, కర్బూజ, తాటి ముంజ, పొట్లకాయ, బీరకాయ వంటి వాటిలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇవి తింటే కడుపు నిండినట్లు అనిపించి, డైట్ కూడా మన కంట్రోల్‌లో ఉంటుంది. కూల్‌డ్రింక్స్, అధికంగా చక్కర వేసిన పండ్ల రసాలు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకోవద్దు. దీని వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. వేసవిలో ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. జుకు ఎనిమిది లీటర్లకు తక్కువ కాకుండా నీటిని తాగాలి. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలి. డైట్ పాటిస్తూ కాలానికి అనుగుణంగా ఆహార పదార్థాలను తీసుకోవాలి.