షేవింగ్‌ చేసుకునేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు

షేవింగ్‌ చేసేటప్పుడు పాత బ్లేడు బాగానే ఉంది కదా అని ఎక్కువసార్లు ఉపయోగిస్తారు. అయితే పాత బ్లేడ్లను ఎక్కువసార్లు వాడటం వల్ల ముఖంపై చర్మం మరింత ముదురుగా మారి వయసు ఎక్కువలా కనిపిస్తుంది.

By అంజి  Published on  21 Jan 2025 1:30 PM IST
shaving, Life style, Blade

షేవింగ్‌ చేసుకునేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు

షేవింగ్‌ చేసేటప్పుడు పాత బ్లేడు బాగానే ఉంది కదా అని ఎక్కువసార్లు ఉపయోగిస్తారు. అయితే పాత బ్లేడ్లను ఎక్కువసార్లు వాడటం వల్ల ముఖంపై చర్మం మరింత ముదురుగా మారి వయసు ఎక్కువలా కనిపిస్తుంది. అలాగే కొన్ని సార్లు బ్లేడ్‌పై తుప్పు ఏర్పడటం వల్ల ముఖ చర్మానికి కూడా మంచిది కాదు. షేవింగ్‌ చేసేటప్పుడు షేవింగ్‌ క్రీమ్‌ లేదా షేవింగ్‌ ఫోమ్‌ ఉపయోగిస్తే గడ్డం గీసుకునే ప్రక్రియ ఈజీగా ఉండటంతో పాటు చర్మం పొడిబారకుండా ఉంటుంది. కొందరు కేవలం నీటితో మాత్రమే తడిపి షేవ్‌ చేసుకుంటారు. ఇది అంత మచిది కాదు.

కొందరు గడ్డానికి ఉన్న వెంట్రుకలను పూర్తిగా మృదువుగా మారకముందే షేవింగ్‌ స్టార్ట్ చేస్తారు. దీని వల్ల ముఖంపై చర్మానికి ఇబ్బంది కలిగి రఫ్‌గా మారుతుంది. అందుకే షేవింగ్‌కు ముందు గడ్డం వెంట్రులను నీటితో కాసేపు రుద్దడం వల్ల అవి మృదువుగా మారతాయి. అప్పుడు ఫోమ్‌ రాసి షేవింగ్‌ చేస్తే చర్మంపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. షేవింగ్‌ తర్వాత గడ్డం భాగాన్ని, ముఖాన్ని తప్పనిసరిగా నీటితో కడుక్కోవాలి. కొందరు క్లాత్‌తో తుడుచుకుని వదిలేస్తారు. దీని వల్ల ముఖంపై ఇన్ఫెక్షన్లు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే షేవింగ్‌ పూర్తయిన తర్వాత మాయిశ్చరైజర్‌ రాసుకుంటే మంచిది.

Next Story