శునకాలు.. టైర్ల మీదనే ఎందుకు మూత్రం పోస్తాయో తెలుసా?

చీమలు ఆహార వేటలో భాగంగా తమ మిత్రులకు రూట్‌ తెలిసేందుకు దారిలో యాసిడ్‌ను విడుదల చేస్తూ వెళ్తాయన్న విషయం మనకు తెలిసిందే.

By -  అంజి
Published on : 26 Oct 2025 12:40 PM IST

dogs, urinate, tires, Lifestyle

శునకాలు.. టైర్ల మీదనే ఎందుకు మూత్రం పోస్తాయో తెలుసా?

చీమలు ఆహార వేటలో భాగంగా తమ మిత్రులకు రూట్‌ తెలిసేందుకు దారిలో యాసిడ్‌ను విడుదల చేస్తూ వెళ్తాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే శునకాలకు అలాంటి యాసిడ్స్‌ ఏవీ విడుదల అవ్వవు. అందుకే దారి మధ్యలో అక్కడక్కడ కొద్ది కొద్దిగా మూత్రం పోస్తూ వెళ్తుంటాయి. వెనకొచ్చే కుక్కలు ఆ మూత్రం ఆధారంగానే ముందుకు కదులుతుంటాయి.

మరి ఆ మూత్రమేదో నేలమీదే పోయొచ్చు కదా? రూ.లక్షలు ఖర్చు చేసి కొనుక్కున్న కార్లు.. బైక్‌ల టైర్ల మీదే ఎందుకు పోయాలి? అనే కదా మీ సందేహం. నిజం చెప్పాలంటే వాటికి రబ్బరు వాసన అంటే ఇష్టమట. అందుకే అలా చేస్తుంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక వాటికి సైన్స్‌ కూడా కొద్దిగా తెలుసండోయ్‌. అందుకే నేల మీద చుచ్చు పోస్తే త్వరగా ఆరిపోతుందని తెలిసి ఓ కాలు పైకెత్తి నిలువుగా ఉండే టైర్లు, చెట్లు, స్తంభాలు వంటి వాటిపై మాత్రమే మూత్రం పోస్తుంటాయి.

Next Story