కాఫీ ఏ సమయంలో తాగితే ఎక్కువ లాభమో తెలుసా?

వేడి వేడి కాఫీ తాగుతుంటే ఆ మజానే వేరు. వెంటనే ఎక్కడా లేని హుషారు వచ్చేస్తుంది. అప్పటిదాకా ఉన్న నిస్సత్తువ మటుమాయమైన భావన కలుగుతుంది.

By అంజి
Published on : 5 Aug 2025 12:40 PM IST

beneficial, drink, coffee, Lifestyle

కాఫీ ఏ సమయంలో తాగితే ఎక్కువ లాభమో తెలుసా?

వేడి వేడి కాఫీ తాగుతుంటే ఆ మజానే వేరు. వెంటనే ఎక్కడా లేని హుషారు వచ్చేస్తుంది. అప్పటిదాకా ఉన్న నిస్సత్తువ మటుమాయమైన భావన కలుగుతుంది. కాఫీని తగిన మోతాదులో అంటే రోజులో ఒకటి (లేదా) రెండుసార్లు చిన్న కప్పుల్లో తాగితే గుండె జబ్బులు, స్ట్రోక్‌, డయాబెటిస్‌ సమస్యల ముప్పు తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. కాఫీలో ఉంటే కెఫెన్‌ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. దీని వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. మనకు చురుకుదనం, హుషారు వస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే రోగాల నుంచి రక్షిస్తాయి.

కొందరు కాఫీ ఉదయం తాగితే మరికొందరు మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రిపూట తాగుతుంటారు. ఇటీవల యూరోపియన్‌ హార్ట్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ఉదయం టిఫఙన్‌ చేసిన తర్వాత కాఫీ తాగడం చాలా ప్రయోజనకరమని పేర్కొంది. ఉదయం కాఫీ తాగేవారిలో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు 31 శాతం తక్కువగా ఉన్నట్టు అధ్యయనం తేలింది. పాలు కలిపిన కాఫీనే కాదు, బ్లాక్‌ కాఫీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని పేర్కొంది. మనకు ఎంత ఇష్టమైనా రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ కన్నా ఎక్కువగా తాగకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Next Story