గ్రీన్ టీ.. ఏ టైంలో తాగాలో తెలుసా?
కోవిడ్ తర్వాత అందరికీ ఆరోగగ్యంపై అవగాహన పెరిగింది. ఏం తినాలి? ఏం తాగాలి అంటూ ఆరోగ్య ప్రయోజనాలను వెతికి పట్టుకుంటున్నారు.
By అంజి Published on 2 Oct 2024 2:30 AM GMTగ్రీన్ టీ.. ఏ టైంలో తాగాలో తెలుసా?
కోవిడ్ తర్వాత అందరికీ ఆరోగగ్యంపై అవగాహన పెరిగింది. ఏం తినాలి? ఏం తాగాలి అంటూ ఆరోగ్య ప్రయోజనాలను వెతికి పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రీన్ టీ బాగా పాపులర్ అయ్యింది. దీన్ని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తేలడంతో చాలా మంది గ్రీన్ టీ తాగడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది తమ డైట్‌లో భాగంగా సన్నబడేందుకు గ్రీన్ టీ తాగుతుంటారు. ఇది తాగడం వల్ల కాస్త బరువు తగ్గే అవకాశం ఉందని కొన్ని పరిశోధనల్లో తేలింది. అయితే గ్రీన్ టీ ఎప్పుడైనా తాగొచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ, కొన్ని సమయాల్లో తాగితేనే రిజల్ట్ ఉంటుందట. మరి ఎప్పుడెప్పుడు తాగొచ్చో తెలుసుకుందామా..
గ్రీన్ టీని ఉదయాన్నే పరిగడుపున తాగకపోవడం ఉత్తమం. బ్రేక్ ఫాస్ట్ చేసిన గంట తర్వాత, అలాగే సాయంత్రం 4 - 5 గంటల మధ్యలో తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
గ్రీన్ టీని బాగా వేడిగా కాకుండా.. గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగితే మంచిదట. అలాగే మధ్యాహ్న భోజనం చేశాక గ్రీన్ టీ తాగకూడదు. దీని వల్ల జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది.
ఉదయం, సాయంత్రం గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. గ్రీన్ టీ తాగిన తర్వాత కొంతసేపటి వరకు ఏమీ తినకూడదు.
అలాగే రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీ అస్సలు తాగకూడదు. ఆ సమయంలో తాగితే నిద్ర సమస్యలు వస్తాయి. కాబట్టి గ్రీన్ టీని పగటి సమయంలో తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.