ఏ ద్రాక్ష తింటే.. ఎలాంటి పోషకాలు లభిస్తాయో తెలుసా?

ప్రస్తుతం మార్కెట్‌లో ద్రాక్ష పండ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని నలుపు రంగులో ఉంటే మరికొన్ని ఆకుపచ్చ రంగులో ఉంటున్నాయి.

By అంజి
Published on : 31 March 2025 8:00 AM

nutrients, grapes, Life style,

ఏ ద్రాక్ష తింటే.. ఎలాంటి పోషకాలు లభిస్తాయో తెలుసా?

ప్రస్తుతం మార్కెట్‌లో ద్రాక్ష పండ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని నలుపు రంగులో ఉంటే మరికొన్ని ఆకుపచ్చ రంగులో ఉంటున్నాయి. గ్రీన్‌ ద్రాక్ష కంటే నలుపు ద్రాక్ష ధర మార్కెట్‌లో ఎక్కువగా ఉంది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ప్రస్తుతం సీడ్‌లెస్‌, స్వీట్‌ ఎక్కువగా ఉండే ద్రాక్ష పండ్లు మార్కెట్‌లో ఎక్కువగా దొరుకుతున్నాయి. ద్రాక్ష పండ్లతో మనకు కలిగే మేలు, ఏ రకం ద్రాక్ష పండ్లతో ఎలాంటి పోషకాలు లభిస్తాయో ఇప్పుడు చూద్దాం..

నల్ల ద్రాక్ష: నల్ల ద్రాక్షలో తీపి, పుల్లవి ఉంటాయి. పుల్లగా ఉండే వాటిని ఎక్కువగా జ్యూస్‌ రూపంలో తీసుకుంటూ ఉంటారు. నల్ల ద్రాక్షలో ఫైబర్‌, విటమిన్‌ సి, కె ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటి ఇన్‌ఫ్లమేటరీ గుణాల మోతాదు కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిలో నేచురల్ షుగర్‌ అయిన ఫ్రక్టోజ్‌ కూడా ఉంటుంది. క్యాన్సర్‌ లక్షణాలను తగ్గించే గుణం ఈ నల్లద్రాక్షలో ఎక్కువగా ఉంటాయి. నల్లద్రాక్షలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు మన శరీర కణాలు దెబ్బతినకుండా కపాడతాయి. డయాబెటిస్‌, అల్జీమర్స్‌, గుండె జబ్బులు, మతిమరుపు వంటి వ్యాధుల ముప్పు నల్లద్రాక్షను తీసుకోవడం వల్ల కలుగుతుంది. నల్ల,ఎర్ర ద్రాక్ష తొక్కలో ఉండే రెస్‌ వెరట్రాల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ గుండె, మెదడుకు రక్షణగా పని చేస్తుంది. అలాగే వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది.

ఎర్రద్రాక్ష: ఈ ఎర్ర ద్రాక్ష లభ్యత తక్కువగా, ధర ఎక్కువగా.. రుచి తియ్యగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా జామ్‌ లేదా జెల్లీలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇందులో కూడా కేలరీలు, ప్రోటీన్‌, విటమిన్‌ సి, కె, ఫైబర్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఆకుపచ్చ ద్రాక్ష: ఆకుపచ్చ ద్రాక్షలో కూడా తీపి, పులుపు రుచి కలిగినవి ఉంటాయి. వీటిలో విటమిన్‌ సి, కె, పొటాషియం, ఫైబర్‌ ఉంటాయి. వీటిలో కూడా యాంటి ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్‌ లక్షణాలు ఉంటాయి. ఆకుపచ్చ ద్రాక్షలో ఉండే గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌ అనే కార్బొహైడ్రేట్లు శరీరానికి శక్తిని ఇస్తాయి. తొక్కలో ఉండే రెస్‌వెరట్రాల్‌ శరీర జీవక్రియనుల మెరుగుపరుస్తుంది. అధికరక్త పోటును నియంత్రించడంలో ఇవి సమర్థంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Next Story