తీపి పదార్థాలు తినడం దాదాపు అందరికీ ఇష్టమే. అయితే ఇది చాలా పరిమితంగా ఉంటే సమస్య ఉండదు. కానీ కొందరు షుగర్ ఉన్న పదార్థాలు, పానీయాలను చాలా ఎక్కువగా తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల ప్రస్తుతానికి బాగానే అనిపించినా భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే చక్కెర తినడం మానేసిన 30 రోజుల తర్వాత మన శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. మనలో శక్తి స్థాయిలు పెరిగి గతం కంటే యాక్టివ్‌గా ఉంటాం. షుగర్ లెవల్స్ పూర్తిగా కంట్రోల్‌లోకి వచ్చి డయాబెటిస్ అదుపులో ఉంటుంది. చక్కెర తినడం మానేసిన వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
చక్కెర తీసుకోవడం ఆపేస్తే చర్మ కణాలు ఆరోగ్యంగా ఉండి వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తాం. ముఖం కాంతివంతంగా మారుతుంది. దంత సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి, ఆందోళన నియంత్రణలో ఉంటాయి. ఫ్యాటీ లివర్ సమస్య కూడా తగ్గుతుంది. ఆహారంలోని పోషకాలను శరీరం చక్కగా శోషించుకోగలుతుంది.