సూర్యోదయం కంటే ముందే నిద్రలేవడం ఆరోగ్యానికి మంచిదని ఇంట్లో పెద్దవాళ్లు చెప్తుంటే మనం పట్టించుకోం. అయితే వారు చెప్పేది అక్షర సత్యం. రాత్రి త్వరగా నిద్రపోయి సూర్యోదయం కంటే ముందే నిద్రలేస్తే మనం ఇతరుల కంటే ఆరోగ్యంలోనూ, వర్క్‌లోనూ ముందుంటాం.ప్రతి రోజూ కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. దీనికి అనుగుణంగా రాత్రి ముందే నిద్రపోయి ఉదయం కనీసం 5 గంటలకైనా మేల్కొనాలి.
లేవగానే ముఖం కడుక్కొని కొద్దిసేపు ప్రశాంతంగా యోగా లేదా ధ్యానం చేయాలి. తర్వాత కాసేపు ప్రకృతిని చూస్తూ ఆస్వాదించండి. అలాగే ఆరుబటయ అవకాశం ఉంటే సూర్యోదయం సమయంలో వాకింగ్ చేస్తే మనసు మరింత ఉత్తేజంగా ఉంటుంది. మనలో నూతనోత్సాహం కలుగుతుంది. తర్వాత ఫ్రెష్ అయ్యి ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి.
ఇలా రోజూ ముందే నిద్రలేస్తే ఇతరుల కంటే మనకు 2, 3 గంటలు ఎక్కువ సమయం లభించినట్టు అవుతుంది. దీన్ని శారీరక వ్యాయామం, ధ్యానం కోసం, ఆ రోజు మన ప్రణాళికలకోసం ఉపయోగించుకోవచ్చు. అలాగే కాలేజీ, ఆఫీస్‌కు టెన్షన్ లేకుండా నిర్ణీత సమయం కంటే ముందే చేరుకోవచ్చు. ప్రారంభంలో కాస్త కష్టమైనా అలవాట చేసుకుంటే భవిష్యత్‌లో మన ఆరోగ్యానికి, కెరీర్‌కు ఈ విధానం ఎంతో మేలు చేస్తుంది.