చెక్క దువ్వెన వాడితే ఎన్ని లాభాలుంటాయో తెలుసా ?
Do you know the benefits of using a wooden comb. సాధారణంగా మనందరం ఇంట్లో ప్లాస్టిక్ దువ్వెనలు వాడుతుంటాం. కానీ ఒకప్పుడు వీటి
By అంజి Published on 3 Feb 2023 11:41 AM GMTసాధారణంగా మనందరం ఇంట్లో ప్లాస్టిక్ దువ్వెనలు వాడుతుంటాం. కానీ ఒకప్పుడు వీటి ప్లేస్‌లో చెక్కతో చేసిన దువ్వెనలు వాడేవాళ్లు. నిజానికి ప్లాస్టిక్ దువ్వెనల కంటే చెక్క దువ్వెనలు వాడటమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా రకాల జుట్టు సమస్యల నుంచి చెక్క దువ్వెనలు కాపాడుతాయంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
చుండ్రును తగ్గిస్తుంది
ప్లాస్టిక్, మెటల్ దువ్వెనలు జుట్టుపై, స్కాల్ఫ్‌పై చాలా కఠినంగా ఉంటాయి. వీటి వాడకం ద్వారా జుట్టుకు హాని కలిగించే చుండ్రు సమస్యలు పెరుగుతాయి. కానీ చెక్క దువ్వెన జుట్టుపై చాలా మృదువుగా ఉంటుంది. తలపై నూనె ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీని కారణంగా సహజంగా చుండ్రు సమస్య తగ్గిపోతుంది. ప్లాస్టిక్ దువ్వెనలు వాడటం ద్వారా నూనె ఉత్పత్తి సరిగ్గా జరగక చుండ్రు సమస్య ఏర్పడుతుంది.
జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది
చిక్కులు పడ్డ జుట్టును విడదీయడంలో ప్లాస్టిక్ దువ్వెనలు చాలా కఠినంగా ఉంటాయి. దీని వల్ల జుట్టు చిట్లిపోవడం, తెగడం జరుగుతుంది. ఇవి చిక్కును విడదీయడానికి బదులు.. జుట్టు రాలిపోయేలా చేస్తాయి. కానీ చెక్క దువ్వెనలు చాలా సులువుగా చిక్కులను విడదీస్తాయి. వీటి వళ్ల జుట్టు తెగిపోయే సమస్య కూడా ఉండదు.
జిడ్డు లేకుండా చేస్తుంది
సాధారణంగా చాలా మందికి స్కాల్ఫ్ మీద జిడ్డు ఉంటుంది. ఇది జుట్టును అందవిహీనంగా చేస్తుంది. సేబాషియస్ గ్రంథులు ఉత్పత్తి చేసే సెబమ్ అనే ద్రవంతో తలలో జిడ్డు ఏర్పడుతుంది. చెక్క దువ్వెనలు ఈ ద్రవాల ఉత్పత్తిని అదుపులో ఉంచుతాయి. సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి. దీంతో స్కాల్ఫ్‌పై జిడ్డు ఏర్పడకుండా కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది
చెక్క దువ్వెనలు స్కాల్ఫ్ మీద చాలా మృదువుగా ఉంటాయి. అంతే కాకుండా జుట్టు నాణ్యతను కూడా పెంచుతాయి. చెక్క దువ్వెనలు కార్బన్ ఆధారితంగా తయారవుతాయి. వీటితో దువ్వుకోవడం ద్వారా తలమీద మసాజ్ చేసిన అనుభూతి కలుగుతుంది. దీంతో తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది మస్సును ప్రశాంత పరుస్తుంది.