వంట గ్యాస్‌ ఆదా చేయడం ఎలానో తెలుసా?

గతంలో మట్టి పొయ్యిల మీద కట్టెలు కాల్చి ఇళ్లలో వంట చేసేవారు. ఆ తర్వాత కూడా వంట చేయడానికి గ్యాస్‌ను తక్కువగా వాడేవారు.

By అంజి  Published on  28 Jun 2024 10:22 AM IST
cooking gas, Lifestyle, Kitchen Tips

వంట గ్యాస్‌ ఆదా చేయడం ఎలానో తెలుసా?

గతంలో మట్టి పొయ్యిల మీద కట్టెలు కాల్చి ఇళ్లలో వంట చేసేవారు. ఆ తర్వాత కూడా వంట చేయడానికి గ్యాస్‌ను తక్కువగా వాడేవారు. ఇప్పుడు ఇది లేకపోతే వంట పూర్తి కాదు. వంట గ్యాస్‌ రేట్లను మనం ఎలాగూ తగ్గించలేం కాబట్టి.. వంట గ్యాస్‌ను ఆదా చేసుకోవడం బెస్ట్‌ ఆప్షన్‌. గ్యాస్‌ను పొదుపు చేయడం వల్ల మన ఇంటి బడ్జెట్‌ తగ్గడమే కాదు.. పర్యావరణానికీ మేలు జరుగుతుంది. మరి అదెలాగే చూసేద్దామా..

తడి పాత్రలు వద్దు

చాలా సార్లు తడిగా ఉన్న పాత్రలను పొయ్యిపై పెట్టి, అందులోని నీళ్లు ఆవిరి అయ్యే వరకు వేడి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గ్యాస్‌ వృథా అవుతుంది. కాబట్టి పాత్రను కాటన్‌ క్లాత్‌తో తుడిచి స్టవ్‌ మీద పెట్టాలి.

ప్రెజర్‌ కుక్కర్‌ బెటర్‌

ప్రెజర్‌ కుక్కర్‌.. గ్యాస్‌ను ఆదా చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. మాంసాహారం వంటి పదార్థాలను ఉడికించేందుకు ప్రెషర్‌ కుక్కర్‌ను వాడితే.. వంట సులభంగా తక్కువ సమయంలో పూర్తి అవుతుంది.

మూత మరవొద్దు

ఆహారాన్ని వండేటప్పుడు మూత పెట్టి కుక్‌ చేస్తే.. ఆరోగ్యానికి మంచిది. అలాగే మూత పెట్టి వండటం వల్ల గ్యాస్‌ కూడా ఆదా అవుతుంది. వంట పూర్తి అవడానికి కొంచెం ముందే స్టవ్‌ ఆపేస్తే.. లోపల ఉన్న వేడి ఆ మిగతా వంటను పూర్తి చేస్తుంది.

లీకులను గమనించాలి

గ్యాస్‌ పైప్‌ ఎక్కువ రోజులు వాడితే.. లీక్‌ అయ్యే అవకాశం ఉంది. లీక్‌ల కారణంగా గ్యాస్‌ వేస్ట్‌ అవ్వడమే కాకుండా.. ప్రమాదాలు జరిగే ముప్పు కూడా ఎక్కువే. అందుకే గ్యాస్‌ లీకవుతుందేమో ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.

Next Story