బ్రష్ చేశాక నాలుకను శుభ్రం చేయకపోతే.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా?

మన ఆరోగ్యం బాగుండాలంటే నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి.. దీని కోసం ఉదయం, సాయంత్రం రెండు పూటలా బ్రష్‌ చేసుకోవాలి.

By అంజి  Published on  13 Aug 2024 10:30 AM GMT
health, tongue clean, brushing, Lifestyle

బ్రష్ చేశాక నాలుకను శుభ్రం చేయకపోతే.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా?

మన ఆరోగ్యం బాగుండాలంటే నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి.. దీని కోసం ఉదయం, సాయంత్రం రెండు పూటలా బ్రష్‌ చేసుకోవాలి. కేవలం దంతాలనే కాదు.. నాలుకను కూడా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. కొందరు పళ్లను మాత్రమే శుభ్రం చేసుకుని నాలుకను క్లీన్‌ చేసుకోరు. దీని వల్ల నాలుకపై పాచి పేరుకొని మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

శుభ్రం చేసుకోకపోతే..

నాలుకను శుభ్రం చేసుకోకపోతే హానికర బ్యాక్టీరియా నోటిలో పెరిగి నేరుగా కడుపులోకి చేరుతుంది. దీని వల్ల రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాలుకను క్లీన్‌ చేసుకోకపోతే దానిపైన తెల్లటి పొర ఏర్పడి కొన్ని రోజులకు తెట్టగా మారుతుంది. దీని వల్ల దుర్వాసన రావడమే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

నాలుకను శుభ్రం చేయకపోవడం వల్ల ఏర్పడే తెల్లటి పొర.. నాలుక మీద టేస్ట్‌ బడ్స్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా రుచి తెలియదు. అందుకే ప్రతి రోజూ పళ్లు తోముకున్న తర్వాత తప్పనిసరిగా నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

నాలుకను ఎలా శుభ్రం చేసుకోవాలి?

రోజూ నాలుకను శుభ్రపర్చుకోవడానికి సులభమైన, సురక్షితమైన మార్గం టాంగ్‌ క్లీనర్‌ వాటం. ప్లాస్టిక్‌ నుంచి స్టీల్‌ దాకా రకరకాల టంగ్‌ క్లీనర్లు దొరుకుతున్నాయి. కానీ ఆరోగ్యం దృష్ట్యా రాగితో చేసిన కాపర్‌ టంగ్‌ క్లీనర్లు కూడా మార్కెట్‌లోకి వచ్చేశాయి. వీటిలో ఏ టంగ్‌ క్లీనర్‌ వాడినా నాలుక శుభ్రపడుతుంది. అలాగే, ఇది ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

టూత్‌ బ్రష్‌ వాడిన తర్వాత కనీసం రెండు సార్లు నాలుకను శుభ్రం చేసుకోవాలి. తద్వారా నాలుకపై ఉన్న మురికి పొర పూర్తిగా తొలగిపోతుంది. పసుపు, నిమ్మరసం మిక్స్‌ చేసి పేస్ట్‌లా చేసి నాలుకపై పది నిమిషాల పాటు అప్లై చేయాలి. తర్వాత టంగ్‌ క్లీనర్‌తో శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల నాలుకపై పేరుకుపోయిన మురికి పూర్తిగా తొలగి శుభ్రపడుతుంది.

ఇవి తెలుసుకోండి..

నాలుక మీద తెల్లగా పొరలా ఏర్పడి, పగుళ్లు లాగా ఉంటే అది నాలుక అపరిశుభ్రతకు సంకేతం.

నాలుక మరీ మెత్తగా ఉన్నా పోషకాహార లోపం ఉన్నట్టు గుర్తించాలి.

నాలుక నలుపు లేదా తెలుపు రంగులో కనిపిస్తే జీర్ణక్రియ సరిగా లేనట్టు గుర్తించాలి.

మూత్రపిండాలు సరిగా పనిచేయనప్పుడు, డయాబెటిస్‌ అదుపులో లేనప్పుడు నాలుక అనారోగ్యంగా కనిపిస్తుంది.

Next Story