భారత్‌లోని ఈ అతి క్రూరమైన తెగ గురించి తెలుసా?
ఆధునిక టెక్నాలజీ యుగంలో కూడా బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్నవారు ఉన్నారని మీకు తెలుసా?
By అంజి Published on 9 Jun 2024 8:15 AM GMTభారత్‌లోని ఈ అతి క్రూరమైన తెగ గురించి తెలుసా?
ఆధునిక టెక్నాలజీ యుగంలో కూడా బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్నవారు ఉన్నారని మీకు తెలుసా?.. అదెక్కడో కాదు. మన భారతదేశంలోనే.. కనీసం మొబైల్, ఇంటర్నెట్ వంటి కనీస సౌకర్యాలను కూడా వీరు వినియోగించరు. మరెలా నివసించగలుగుతున్నారని అనుకుంటున్నారా? ఇవన్నీ లేకపోయినా వారు ప్రకృతితో మమేకమై జీవిస్తున్నారు. వారే అండమాన్‌లోని నార్త్ సెంటినల్ ఐలాండ్‌లో నివసించే సెంటినలీస్ గిరిజనులు. అంతేకాదు వీరిని అతిక్రూరమైన తెగగా పరిగణిస్తారు. వీరి గురించి తెలుసుకునేందుకు ఈ తెగలోని ఇద్దరిని అమెరికాకు చెందిన వైడల్ పోర్ట్‌మన్ అనే శాస్త్రవేత్త 2000 సంవత్సరంలో కిడ్నాప్ చేశారు.
కానీ బయటి వాతావరణానికి వారి వ్యాధి నిరోధక వ్యవస్థ అలవాటుపడక పోర్ట్ బ్లెయిర్ చేరే లోపే తీవ్ర జ్వరంతో మరణించారు. అంతేకాదు వీరితో సంబంధాలు ఏర్పరుచుకోవాలనుకున్న ప్రభుత్వ ప్రయత్నాలేవీ ఫలించలేదు. కానీ 1991లో ఆంథ్రోపాలజిస్ట్ మధుమాలను ఈ తెగ ఆహ్వానించింది. చరిత్రలో వీరిని కిలిసి ప్రాణాలతో తిరిగొచ్చిన వ్యక్తిగా ఆమె నిలిచారు. 2004లో ఓ సారి తీవ్ర తుపాను వచచింది. ప్రభుత్వం సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు పంపించింది. వెళ్లినవారు వారిని చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే నిత్యం ప్రకృతిలోనే జీవించే వారు ముందుగానే తుపాన్‌ను పసిగట్టి ఎత్తైన ప్రాంతాలకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. అప్పటి నుంచి అక్కడి ఎవరు వెళ్లడానికి వీలు లేదని ప్రభుత్వం నిషేధం విధించింది.