రక్తాన్ని శుద్ధి చేసే ఈ సహజ మూలికల గురించి తెలుసా?

మన శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్‌ను, పోషకాలను రక్తం చేరవేస్తుంది. అలాగే కణాల్లోని కార్బన్‌ డయాక్సైడ్‌, ఇతర వ్యర్థాలను తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

By అంజి
Published on : 22 Aug 2025 1:32 PM IST

natural herbs, blood purify,Heart-leaved moonseed, Life style

రక్తాన్ని శుద్ధి చేసే ఈ సహజ మూలికల గురించి తెలుసా?

మన శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్‌ను, పోషకాలను రక్తం చేరవేస్తుంది. అలాగే కణాల్లోని కార్బన్‌ డయాక్సైడ్‌, ఇతర వ్యర్థాలను తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే కొన్ని చెడ్డ అలవాట్లు, ఆహారంలో ఉండే వ్యర్థ పదార్థాల కారణంగా రక్తంలో మలినాలు చేరుతాయి. ఇవి ఎక్కువైతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో, రక్తంలో వ్యర్థాల తొలగింపు కోసం కొన్ని మూలికలు తీసుకుంటే మంచిదని కొందరు ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

తిప్పతీగ: తిప్పతీగకు రక్తం నుంచి విషాన్ని బయటకు పంపే శక్తి ఉందని చెబుతారు. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుంది. తిప్పతీగ పొడిని గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.

వేప: వేపలో యాంటీ బార్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో అద్భుతంగా పని చేస్తాయి. రక్త నాళాల్లో బ్లడ్‌ గడ్డ కట్టకుండా చేస్తుంది. చర్మ వ్యాధులు, అల్సర్లు, కీళ్ల నొప్పులకు మంచి ఔషధంలా పని చేస్తుంది. రోజూ రెండు వేపాకులు నమిలినా లేదా గోరువెచ్చని నీళ్లలో వేప పొడి వేసుకుని తాగినా ఆరోగ్యాని మంచిదే.

పసుపు: పసుపులో యాంటీసెప్టిక్‌ లక్షణాలు ఉంటాయి. పసుపు పొడిని పాలలో కలిపి తీసుకోవడం వల్ల ఎర్రరక్తకణాల సంఖ్య పెరుగుతుంది.

ఉసిరి: రక్తం నుంచి హానికారక విష పదార్థాలను ఉసిరి బయటకు పంపి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఉసిరి రసాన్ని తరచూ తీసుకుంటే.. హిమోగ్లోబిన్‌, ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. ఉసిరి పచ్చడి, పచ్చి ఉసిరి మీ డైట్‌లో ఉండేలా చూసుకోండి.

తులసి: ఖాళీ కడుపుతో నాలుగు తుసలి ఆకులను తింటే రక్తం శుభ్రం అవుతుంది. ఇది రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా రోగ నిరోధక శఖ్తి పెరుగుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

Next Story