మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

'పాప్‌కార్న్‌ బ్రెయిన్‌'.. ఈ మధ్య ఇంటర్నెట్‌లో ఎక్కువగా కనిపిస్తున్న పదం ఇది. ప్రస్తుతం మనలో చాలా మందిలో ఈ లక్షణాలు..

By -  అంజి
Published on : 15 Nov 2025 1:40 PM IST

Lifestyle, symptoms, popcorn brain

మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

'పాప్‌కార్న్‌ బ్రెయిన్‌'.. ఈ మధ్య ఇంటర్నెట్‌లో ఎక్కువగా కనిపిస్తున్న పదం ఇది. ప్రస్తుతం మనలో చాలా మందిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

చెయ్యాల్సిన పని చాలా ఉన్నా.. కాసేపు చేసేసరికి విరామం కావాలని కోరుకోవడం, ఏ నోటిఫికేషన్‌ రాకపోయినా ఫోన్‌ వైపు పదే పదే చూడటం, అవసరం లేకున్నా యాప్‌లన్నీ తెరవడం, ఫోన్‌లో చిన్న నోటిఫికేషన్‌ వచ్చినా దాన్ని చూసేవరకూ మనసు ఆగకపోవడం, మానసిక అలసట వంటి లక్షణాలు మీలో కనిపిస్తే 'పాప్‌కార్న్‌ బ్రెయిన్‌' బారిన పడినట్టే అని గుర్తించారు. తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. పిల్లలు, అమ్మాయిలే ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. ఫలితంగా పెద్దవారిలో ఆందోళన, ఒంటరిగా ఉండాలనిపించడం, చిరాకు, కోపం.. పిల్లల్లో అయితే కోపం, సరిగా నిద్రలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయట.

దీని నుంచి బయటపడేందుకు మొబైల్‌లోని వాడని యాప్స్‌ని తీసేయాలి. షాపింగ్‌ యాప్‌ల వైపు మన దృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని తక్కువగా ఉంచుకోవడం మంచిది. ఒక పనిలో ఉన్నప్పుడు అది పూర్తయ్యాకే ఫోన్‌ ముట్టుకోవాలనే నియమం పెట్టుకుని అమలు చేయాలి. నిద్ర పోవడానికి ముందు, భోజన సమయంలో ఫోన్‌ను పక్కన పెట్టడం శ్రేయస్కరం. పుస్తకాలు చదవడం, ఖాళీగా ఉన్నప్పుడు కాసేపు నడవటం వంటివి చేయాలి.

Next Story