ఫాస్ట్‌ ఫుడ్‌ తింటున్నారా?.. అయితే ఇది తెలుసుకోండి

సరదాగా అలా బయటికి వెళ్లినప్పుడో, వంట చేసుకోవడానికి ఓపిక లేనప్పుడో జస్ట్‌ రూ.100తోనే కడుపు నింపుకోవడానికి ఉండే బెస్ట్‌ ఆప్ష్‌ ఫాస్ట్‌ఫుడ్.

By -  అంజి
Published on : 21 Sept 2025 11:14 AM IST

fast food, Lifestyle, memory, Health problem

ఫాస్ట్‌ ఫుడ్‌ తింటున్నారా?.. అయితే ఇది తెలుసుకోండి

సరదాగా అలా బయటికి వెళ్లినప్పుడో, వంట చేసుకోవడానికి ఓపిక లేనప్పుడో జస్ట్‌ రూ.100తోనే కడుపు నింపుకోవడానికి ఉండే బెస్ట్‌ ఆప్ష్‌ ఫాస్ట్‌ఫుడ్. ఆ షాపుల్లో ఈ ఫుడ్‌ ఎంత ఫాస్ట్‌గా రెడీ అవుతుందో మన మైండ్‌లోనూ ఈ ఫుడ్‌ అంతే ఫాస్ట్‌గా ప్రభావం చూపుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.

ఈ ఫుడ్‌ తీసుకున్న నాలుగో రోజు నుంచే ఇది మన మైండ్‌లో తన పనిని మొదలుపెడుతుందట. అందులో కీలక భాగమైన 'హిప్పోకాంపస్‌'ని ప్రభావితం చేస్తుందట. మనం స్విచ్‌ బోర్డు నుంచి స్విచ్చులు పీకేస్తే లైటు, టీవీ, ప్యాను ఎలా ఆగిపోతాయే.. ఈ ఫుడ్‌ కూడా మన మైండ్‌లో అలాంటి కొన్ని కనెక్షన్లను కట్‌ చేసి చాలా విషయాలను మర్చిపోయేలా చేస్తుందట. దీంతో న్యూరాన్లు దెబ్బతినడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా ఎఫెక్ట్‌ అవుతుందట.

ఏదైనా కొత్తది నేర్చుకుందామన్నా నేర్చుకోలేరట. అక్కడితో ఆగకుండా ఈ ఫుడ్‌ వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుందని, మధుమేహం వచ్చే ప్రమాదం పొంచి ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటికైనా వీటిని తినడం ఆపేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Next Story