మొటిమలు తగ్గాలంటే ఇలా చేయండి
రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగడం వల్ల ఆరోగ్యం బాగుండటంతో పాటు మొటిమల సమస్య కూడా తగ్గుతుంది.
By అంజి Published on 24 Jan 2025 9:44 AM ISTమొటిమలు తగ్గాలంటే ఇలా చేయండి
రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగడం వల్ల ఆరోగ్యం బాగుండటంతో పాటు మొటిమల సమస్య కూడా తగ్గుతుంది. దోసకాయ, పుచ్చకాయ, బచ్చలికూర, పాలకూర, టమాటా, నారింజ వంటి వాటిలో నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి మొటిమల సమస్యలను తగ్గిస్తాయి. క్యారెట్లు తినడం వల్ల కూడా మొటిమలు, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల చెమట బయటకు వెళ్లి మొటిమలు తగ్గుతుంటాయి. రసాయనాలు ఎక్కువగా ఉండే క్లెన్సర్లను వాడకూడదు. ఇవి డీహైడ్రేషన్‌కు దారి తీసి మొటిమలకు కారణమవుతాయి.
రోజుకు రెండు సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల ముఖంలో వృద్ధ్యాప్య ఛాయలు తొలగడంతో పాటు మొటిమల సమస్య కూడా తగ్గుతుంది. ముఖ్యాన్ని ప్రతిరోజూ రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి. దీని వల్ల ముఖంపై మృతకణాలు వదిలిపోతాయి. అలాగని రోజులో ఎక్కువసార్లు ముఖం కడుక్కోవద్దు. ముఖాన్ని మృదువైన సబ్బుతో కడుక్కోవాలి. మొత్తని క్లాత్‌తో కూడిన తువ్వాలతో సున్నితంగా అద్దుతూ ముఖాన్ని తుడుచుకోవాలి. మొటిమలను తరచూ గోళ్లతో గిల్లొద్దు. చేతి వేళ్లతో తాకడం, గోకడం చేయొద్దు. దీని వల్ల సమస్య పెరిగే అవకాశం ఉంది.
(గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం.. ఇక్కడ తెలియజేస్తున్నాం. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా డాక్టర్‌ని సంప్రదించడం మంచిది)