విటమిన్ D గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?
Did you know these things about vitamin D? మానవ శరీరానికి అన్ని విటమిన్లు అవసరమే. ఏ విటమిన్ లోపించినా.. రోగాలు దాడి చేసేందుకు రెడీగా ఉంటాయి.
By అంజి Published on 12 Jan 2023 6:39 PM ISTమానవ శరీరానికి అన్ని విటమిన్లు అవసరమే. ఏ విటమిన్ లోపించినా.. రోగాలు దాడి చేసేందుకు రెడీగా ఉంటాయి. రోగాల నుంచి కాపాడే విటమిన్లలో D విటమిన్ అన్నిటికంటే ముఖ్యమైనది. అసలు ఈ D విటమిన్ మనకు ఎలా లభిస్తుంది ? శరీరంపై D విటమిన్ చూపించే ప్రభావం ఏమిటి ? D విటమిన్ తగినంత లేకపోతే ఏమవుతుంది? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
D విటమిన్ అంటే ఏమిటి ?
మానవ శరీరంలోని అన్ని విటమిన్ల కంటే D విటమిన్ చాలా ముఖ్యమైనది. ఇది మన శరీరంలో రోగ నిరోదకశక్తి కాకుండా ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది. శరీరానికి అత్యంత ముఖ్యమైన D2,పెంచడమే D3విటమిన్ కాంప్లెక్స్‌లను తయారు చేస్తుంది. సాధారంణంగా ఆహార పదార్థాల కంటే.. సూర్యరశ్మి నుంచి D విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. అందుకే D విటమిన్‌ను 'సూర్యరశ్మి విటమిన్' అని కూడా అంటారు.
విటమిన్ D శరీరానికి ఎలా లభిస్తుంది.
నిజానికి మనకు కావాల్సిన అన్ని విటమిన్స్ ఫుడ్ ద్వారానే లభిస్తాయి. కానీ D విటమిన్ ఎక్కువగా లభించే ఫుడ్స్ చాలా తక్కువ. అయితే విటమిన్ D బాగా అందాలంటే సూర్యరశ్మిని మించినది మరోటి లేదంటున్నారు డాక్టర్లు. సూర్యరశ్మి మన శరీరంలోని కొవ్వులో కరిగి.. D విటమిన్‌గా మారుతుదని చెప్తున్నారు. అందుకే రోజులో కనీసం 20నిమిషాలు ఎండలో ఉండాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే మన శరీరానికి కావాల్సినంత D విటమిన్ దొరుకుతుందని చెప్తున్నారు. అలా అని గంటల పాటు ఎండలో ఉన్నా ప్రమాదమే అంటున్నారు.
మానవ శరీరంలో D విటమిన్ ఎలా పని చేస్తుంది.
మానవ శరీరానికి రోజుకు 10గ్రా. D విటమిన్ అవసరం. ఇది ముఖ్యంగా శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. దీంతో చాలా రకాల వ్యాధులు అంత ఈజీగా మన దరికి చేరవు. శరీరానికి కావాల్సినంత కాల్షియం, పాస్పేట్‌ను D విటమిన్ తయారు చేస్తుంది. దీని ద్వారా ఎముకలు బలంగా ఉంటాయి. అంతే కాకుండా కాన్యర్, రికెట్స్, బోలు, క్షయ, జుట్టు రాలడం, స్థూలకాయం సమస్యలు రాకుండా ఉంటాయి. గాయాల నుంచి త్వరగా కోలుకునేందుకు కూడా D విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతంది.
D విటమిన్ లోపిస్తే ఏం జరుగుతుంది.
D విటమిన్ లోపిస్తే రోగాలకు మనమే గేట్ తెరిచి ఆహ్వానించినట్టని డాక్టర్లు చెప్తున్నారు. ఈ విటమిన్ లోపం వల్ల ముఖ్యంగా రోగ నిరోదక శక్తి క్షీణిస్తుంది. దీని ఫలితంగా అన్ని రకాల వ్యాధులు చాలా సులువుగా సోకుతాయి. వెన్ను నొప్పి, జుట్టు రాలడం, డిప్రెషన్ లాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. దీని వల్ల ఏ పని మీద ఎక్కువగా ఏకాగ్రత ఉండదు. దీంతో శారీరకంగానే కాక.. మానసికంగా కూడా సమస్యలు ఎక్కువగా వస్తాయంటున్నారు డాక్టర్లు.
గర్భిణీ స్త్రీలలో మరీ ముఖ్యం
సామాన్యులతో పోలిస్తే గర్భిణీ స్త్రీలలో D విటమిన్ మరింత ముఖ్యమని డాక్టర్లు సూచిస్తున్నారు. గర్భిణులు తప్ప కుండా ఎండలో కాసేపు ఉండాలంటున్నారు. అప్పుడే కడుపులో బిడ్డ ఎదుగుదల ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు. దీని ద్వారా పుట్టే పిల్లలు చాలా తక్కువ అనారోగ్యానికి గురవుతారని చెప్తున్నారు. డెలివరీ సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు జరకుండా ఉండాలంటే గర్భిణులకు D విటమిన్ తగిన మోతాదులో అందాలని సూచిస్తున్నారు.
D విటమిన్ లోపాన్ని ఎలా గుర్తించాలి
చిన్న చిన్న పనులకే అలసిపోవడం D విటమిన్ లోపం యొక్క మొదటి లక్షణం. D విటమిన్ లోపం వల్ల ఎముకల్లో కాల్షిచం తగ్గిపోతుంది. దీని వల్ల ఎముకలు, కండరాల్లో నొప్పి వస్తుంది. తరచుగా వచ్చే వెన్ను నొప్పి, మెడ నొప్పి కూడా D విటమిన్ లోపానికి సంకేతాలంటున్నారు డాక్టర్లు. ఎక్కువగా టెన్షన్‌గా ఉండటం, నీరసంగా ఉండటం కూడా D విటమిన్ లోపమే అంటున్నారు. ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే వెంటనే D విటమిన్ పెంచుకునే పని ప్రారంభించండి.