క్రిస్మస్‌ ట్రీ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

కొనిఫెర్‌ జాతికి చెందిన మొక్కలను క్రిస్మస్‌ ట్రీలుగా అలంకరిస్తారు. ఇవి ఏడాది పొడవునా పచ్చగానే ఉంటాయి.

By అంజి  Published on  23 Dec 2024 3:00 AM GMT
Christmas tree, Conifers, Christmas

క్రిస్మస్‌ ట్రీ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

కొనిఫెర్‌ జాతికి చెందిన మొక్కలను క్రిస్మస్‌ ట్రీలుగా అలంకరిస్తారు. ఇవి ఏడాది పొడవునా పచ్చగానే ఉంటాయి. వాటిలాగే మన జీవితం కూడా ఎప్పటికి పచ్చగానే ఉండాలని క్రిస్మస్‌ సందర్భంగా ఈ చెట్టును అందంగా అలంకరిస్తారు. ఈ చెట్టుకు ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలీదని భావిస్తారు. అయితే క్రిస్మస్‌ రోజు ఈ చెట్టును పూజించే ఆనవాయితీ మొదట్లో లేదు. రోమ్‌ నగరాల్లో శీతాకాలంలో సాధారణంగానే చెట్లను అలంకరించి పూజించేవారు. కొమ్మలను ఇళ్లకు కట్టుకునేవారు. అయితే పౌరహక్కుల ఉద్యమకారుడు అయిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ ఓ రోజు చెట్టు కొమ్మలు తెచ్చి అందంగా అలంకరించి పూజించారు.

ఆయనని ఫాలో అయ్యేవారు దీన్ని అనుసరించారు. క్రమంగా క్రిస్మస్‌ రోజు చెట్టును అందంగా అలంకరించడం ఆనవాయితీగా మారింది. అలాగే కొన్ని వందల ఏళ్ల క్రితం జనరల్‌ ఫెడరిక్‌ అడాల్ప్‌ రెడిజిల్‌ అనే వ్యక్తి సైనికులకు ఇచ్చిన విందులో వారిని అబ్బురపరిచేందుకు ఈ చెట్లను వినియోగించారట. అందుకే ఈ ఆచారం ప్రాచుర్యం పొందిందని టాక్. 18వ శతాబ్దంలో విక్టోరియా రాణి కూడా తన రాజ భవనంలో జరిపిన క్రిస్మస్‌ వేడుకల్లో ఈ చెట్టును అందంగా అలంకరించారట. దీంతో ఈ సంప్రదాయం ప్రపంచ దేశాలకు విస్తరించింది.

Next Story