క్రిస్మస్‌ ట్రీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ 'క్రిస్మస్'. ఏసు క్రీస్తు జన్మదినం సందర్భంగా ఏటా డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ వేడుకలు జరుపుకుంటారు.

By అంజి  Published on  24 Dec 2023 1:29 PM IST
Christmas, Christmas tree, Merry Christmas

క్రిస్మస్‌ ట్రీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ 'క్రిస్మస్'. ఏసు క్రీస్తు జన్మదినం సందర్భంగా ఏటా డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ వేడుకలు జరుపుకుంటారు. ఈ పర్వదినాన చర్చిల్లో దైవ ప్రారథనలు మిన్నంటుతాయి. ఏసు ప్రబోధలను గుర్తు చేసుకుంటారు. తమ పాపాలను ప్రక్షాళన చేసి దైవ మార్గంలో నడిపించమని వేడుకుంటారు. ఇక క్రిస్మస్‌ అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది 'క్రిస్మస్‌ చెట్టు'. అసలు క్రిస్మస్‌ చెట్టుని భగవంతుడి ప్రతిరూపం అని ఎందుకంటారు?. ఈ క్రిస్మస్‌ చెట్టును ఎందుకు ఇళ్లల్లో ఉంచుతారు? ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

క్రిస్మస్‌ చెట్టుకు ఎప్పుడూ ఇవ్వడమే కానీ, తీసుకోవడం తెలియదంటారు. పండుగ రోజు ఈ చెట్టు కింద బహుమతులు ఉంచి, వాటిని కుటుంబ సభ్యులంతా తీసుకోవడం ఒక ఆనవాయితీ. ఈ బహుమతులన్నీ దేవుని దగ్గరి నుంచే వచ్చాయి అని భావిస్తారు. పశ్చిమ దేశాల్లోని మంచు వల్ల మొక్కలన్నీ జీవాన్ని కోల్పోతాయి. కానీ క్రిస్మస్‌ చెట్టుగా పిలుచుకునే 'ఫర్‌ ట్రీ' మాత్రం పచ్చగా ఉంటుంది. అందుకే ఇది జీసస్‌ నిత్య జీవానికి, చైతన్యానికి ప్రతీక అంటారు.

ఓ రాత్రి ఒక చిన్న ఇంట్లో ఇద్దరు పిల్లలు వాళ్ల నాన్న కోసం వేచి చూస్తుంటారు. ఆహారం తీసుకొస్తానని వెళ్లిన నాన్న ఒక రొట్టె ముక్కతో తిరిగొస్తాడు. ప్రార్థన చేసుకుని ఆ రొట్టె ముక్కను ముగ్గురూ పంచుకుని తినబోతుండగా ఇంటి బయట ఓ బాలుడు చలితో వణుకుతూ కనిపిస్తాడు. అతనికి తమ వంతు ఆహారాన్ని ఇస్తారు. ఆ తర్వాత వాళ్లందరూ లేచి చూసేసరికి బాలయేసు ప్రత్యక్షమవుతాడు. 'మీ దానగుణం చాలా గొప్పది. అది నాకు నచ్చింది' అని చెప్పిన ఆయన.. ఒక ఎండు కొమ్ము నేలలో నాటుతాడు. అది వెంటనే పచ్చగా మారి, బంగారు చెట్టుగా మారిపోతుంది. అలా ప్రభువు కృపకు చిహ్నంగా క్రిస్మస్‌ ట్రీనీ అందరూ తమ ఇళ్లలో ఉంచి, అలంకరిస్తారు.

Next Story