ఈ ఆహారపదార్ధాలకి EXPIRY DATE ఉండదని మీకు తెలుసా..?

ఎక్స్పైర్ డేట్ అయిపోయిన ఆహారపదార్థాలను వాడితే అది మనపై చెడు ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది.

By -  అంజి
Published on : 25 Jan 2026 6:44 PM IST

foods, EXPIRY DATE, Salt, honey, coffee, Lifestyle

ఈ ఆహారపదార్ధాలకి EXPIRY DATE ఉండదని మీకు తెలుసా..? 

ఎక్స్పైర్ డేట్ అయిపోయిన ఆహారపదార్థాలను వాడితే అది మనపై చెడు ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది. అందుకే మామూలుగా మనం ఏదైనా ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలంటే దాని యొక్క ఎక్స్పైర్ డేట్ చూసి కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే కొన్ని ఆహార పదార్థాలకి మాత్రం ఎలాంటి ఎక్స్పైర్ డేట్ ఉండదనే విషయం మీకు తెలుసా?. అవును, కొన్ని ఆహార పదార్థాలను ఎంత కాలమైన సరే నిల్వ ఉంటాయి. దాని మీద ఎక్స్పైర్ డేట్ రాసినప్పటికీ కూడా నిజానికి అవి పాడైపోవు.మరి ఎక్స్పైర్ అయినా వాడుకునే ఆహార పదార్థాలు ఏంటో ఓ సారి చూద్దాం..

1. ఉప్పు

జనరల్‌గా ఉప్పుని ఇంచుమించు అన్ని వంటకాల్లో వాడుతూ ఉంటాము. అయితే ఉప్పు ఎప్పుడూ కూడా రుచిని కోల్పోదు.దీని గడువు ముగిసిపోయినా సరే పాడవ్వదు. దీన్ని ఎక్స్పైర్ డేట్‌తో సంబంధం లేకుండా వాడుకోవచ్చు.

2. కాఫీ

కాఫీకి కూడా ఎక్స్పైర్ డేట్‌ ఉండదు. గింజలను డ్రై ప్రాసెసింగ్‌లో భాగంగా ఎండలో ఎండబెట్టి కాఫీ పొడిని తయారుచేస్తారు. ఇలా తయారు చేసే ప్రాసెస్‌లో ఇది చెడిపోకుండా చేస్తారు. కాబట్టి ఇది ఎక్స్పైర్ అయినప్పటికీ కూడా పాడైపోదు. దీంతో ఒకవేళ కాఫీ ఎక్స్పైర్ డేట్ దాటినా సరే వాడుకొవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు.

3. తేనె

ఆహారపదార్ధాల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటే అది త్వరగా పాడైపోతుంది. అయితే తేనెలో మాత్రం నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీని ఎక్స్పైర్ డేట్ అయిపోయిన పాడైపోదు. దీంతో తేనెను కూడా గడువు తేదీ పూర్తయిన తర్వాత వాడుకోవచ్చు.

4. సోయా సాస్

ఓపెన్ చేయని సోయా సాస్ బాటిల్ దశాబ్దాల వరకు కూడా నిల్వ ఉంటుంది.ఇది కూడా త్వరగా పాడవ్వదు. కాబట్టి దీనిని కూడా గడువు తేదీ దాటిపోయిన తర్వాత వాడుకోవచ్చు.ఏ సమస్య ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Next Story