కూరలు, సాంబార్, ఇతర ఆహారపదార్థాల్లో మునక్కాయను మనం వాడుతుంటాం.. ఇది ఆహార పదార్థాలకు రుచిని ఇవ్వడమే కాదు.. తనలోని ఔషధ గుణాలతో అనేక వ్యాధులను తగ్గించే శక్తిని కలిగి ఉంది. మునక్కాయలో విటమిన్ ఎ, బి1, బి2, బి3, బి6, సి, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, కాల్షియం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని అందిస్తాయి. మునక్కాయ రసం ఎముకలను దృఢంగా చేస్తుంది.
మునక్కాయ ఆకుల్లో కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి. ఇది బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది. మలబద్ధకం, రక్తహీనత, అధిక రక్తపోటుతో బాధపడేవారికి మునక్కాయ మేలు చేస్తుంది. మునక్కాయ వల్ల మెదడు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. దీనిలోని మెగ్నీషియం రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.