మధుమేహం.. ఈ విషయాలు తెలుసా?
మారుతున్న జీవనశైలి, ఇతర కారణాలతో చాలా మంది చిన్నప్పటి నుంచే డయాబెటిస్ బారిన పడుతున్నారు.
By - అంజి |
మధుమేహం.. ఈ విషయాలు తెలుసా?
మారుతున్న జీవనశైలి, ఇతర కారణాలతో చాలా మంది చిన్నప్పటి నుంచే డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధి లక్షణాలు తెలియక చాలా మంది గుర్తించలేకపోతున్నారు. వయసు బట్టి ఎవరిలో ఎలాంటి డయాబెటిస్ లక్షణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
చిన్నారులు, బాల బాలికల్లో టైప్-1 డయాబెటిస్ లక్షణాలు ఉంటాయి. అధిక దాహం, తరచుగా మూత్ర విసర్జన, బరువు ఎక్కువగా తగ్గిపోవడం, అలసట, దృష్టి లోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టరును సంప్రదించడం మంచిది.
యువత, మధ్య వయసు ఉన్న వారిలో టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తాయి. స్థూలకాయం, గాయాలు త్వరగా మానకపోవడం, చర్మం, మూత్ర పిండాల ఇన్ఫెక్షన్లు ఎక్కువగా రావడం, ఆకలి ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలు గుర్తిస్తే డయాబెటిస్ పరీక్ష చేయించడం మంచిది.
వృద్ధుల్లో ఎక్కువగా దాహం వేయడం, తరచుగా మూత్ర విసర్జన, ఎక్కువగా అలసట, దృష్టి లోపం, గాయాలు మానడం ఆలస్యం కావడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుని సూచన మేరకు షుగర్ టెస్ట్ చేయించాలి. వ్యాధి ఉందని తేలితే చికిత్స తీసుకోవాలి.