వినాయక చవితిని వైభవంగా చేసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. మండపాన్ని తయారు చేయడం, పూల మాలలు, ఆభరణాలు, మిరుమిట్లు గొలిపే లైట్లు, ఇతర అలంకరణ వస్తువులతో గణేష్ మండపాన్ని అందంగా తయారు చేస్తుంటారు. దాని కోసం ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయి.
ముందుగా ఇంట్లో ఏ ప్రదేశంలో మండపం ఏర్పాటు చేయ్యాలనుకుంటున్నారో గుర్తించాలి. కార్నర్ అయితే అలంకరణకు బాగుంటుంది.
ప్రతి అలంకరణలోనూ పూలను భాగం చేస్తే మంచి అందం వస్తుంది. పువ్వుల దండలను లైన్లుగా అమర్చితే సరిపోతుంది. త్వరగా వాడిపోనిని, బరువు లేని పూలు చూసుకోండి.
పూసలు, అట్టలతో వచ్చే హ్యాంగింగ్స్ బ్యాక్‌డ్రాప్‌కు ఏర్పాటు చేయాలి. ఇవే కాకుండా బ్రాస్ బెల్స్, దేవతా మూర్తులున్న హ్యాంగింగ్స్ వాడినా లుక్ బావుంటుంది.
వర్క్ ఉన్న క్లాత్ లేదా ఏవైనా ముగ్గులున్న బ్యాక్ డ్రాప్ వాడితే మండపం అందంగా మారిపోతుంది.
మండపం అలంకరించడానికి ఇంట్లో సరైన స్థలం లేకపోతే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న థర్మాకోల్ మండపాన్ని కొనుక్కోవచ్చు. దాన్ని మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు.