వర్షాకాలంలో ఫ్లూ సమస్యలతో పాటు జుట్టు సంబంధిత ఇబ్బందులు కూడా పెరుగుతాయి. ఈ కాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టులో చెమట చేరి అక్కడి చర్మం పాడవుతుంది. వెంట్రుకలు రాలిపోవడం, చుండ్రు, జుట్టు ఎక్కువగా చిక్కులు పడటం వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల ఈ సీజన్‌కు తగ్గట్టు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వెంట్రుకలను కాపాడుకోవచ్చు.
వర్షాకాలంలో తలపై ఎక్కువగా ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఆయిల్స్ మితంగా రాసుకుని కుదుళ్ల వకు బాగా మసాజ్ చేయాలి. వారానికి రెండు, మూడుసార్లు కెమికల్స్ లేని షాంపూలతో స్నానం చేయాలి. అలాగే మంచి కండీషనర్ వాడాలి. జుట్టు చిక్కులు తీసుకోవడానికి బ్రిజిల్స్ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండే దువ్వెనలను వాడాలి.
స్నానం తర్వాత సాధారణ టవల్ కాకుండా మైక్రోఫైబర్ టవల్‌ను ఉపయోగించాలి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కాస్మెటిక్ డెర్మటాలజీ జర్నల్‌లోనూ మైక్రోఫైబర్ టవల్స్ వల్ల జుట్టు రాలడం తగ్గుతుందని సైంటిస్టులు ప్రస్తావించారు. జుట్టుపై బలంగా రుద్దకుండా పైపైన తుడుచుకుంటే కుదుళ్లు దెబ్బతినవు. హెయిర్ డ్రయర్, హెయిర్ స్ట్రెయిట్నర్‌లనూ మితంగా వాడాలి.