గర్భిణులు బొప్పాయి తినొచ్చా?.. ఇది తెలుసుకోండి

శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే పండ్లలో బొప్పాయి ఒకటి. కానీ ఈ పండును గర్భిణులు తీసుకుంటే గర్భస్రావం జరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు.

By అంజి
Published on : 3 Aug 2025 1:30 PM IST

pregnant women, papaya, Life style

గర్భిణులు బొప్పాయి తినొచ్చా?

శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే పండ్లలో బొప్పాయి ఒకటి. కానీ ఈ పండును గర్భిణులు తీసుకుంటే గర్భస్రావం జరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. దీంతో చాలా మంది మహిళలు బొప్పాయికి దూరంగా ఉంటారు. కానీ గర్భిణులు పొరపాటున చిన్న బొప్పాయి ముక్కని తింటే ప్రమాదమా? అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. ఈ డౌట్‌ మీకు ఉన్నట్టయితే ఇప్పుడే క్లియర్‌ చేసేద్దాం..

గర్భిణులు బాగా పండిన బొప్పాయిన తినవచ్చు. ఇందులో బీటా కెరాటిన్‌, కోలిన్‌ ఫైబర్‌, ఫొలేట్‌, పొటాషియం, విటమిన్‌ ఏ, బీ,సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్భిణులకు ఎంతో మేలు చేస్తాయి. కానీ పచ్చి (ఆకుపచ్చగా ఉన్నవి) బొప్పాయిని గర్భిణులు చిన్న ముక్క కూడా తీసుకోకూడదు. పొరపాటున చిన్న ముక్క తీసుకున్నా గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే పచ్చి బొప్పాయిలో లేటెక్స్‌ అనే పదార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి పచ్చి బొప్పాయిని పొరపాటున తింటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

Next Story