ఏసీ ఆన్‌ చేసినప్పుడు ఫ్యాన్‌ వాడొచ్చా?

వేసవి రానే వచ్చింది. ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో అందరూ ఏసీలు వేసుకుని ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టారు.

By అంజి
Published on : 26 April 2025 11:00 AM IST

fan, AC, Summer

ఏసీ ఆన్‌ చేసినప్పుడు ఫ్యాన్‌ వాడొచ్చా?

వేసవి రానే వచ్చింది. ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో అందరూ ఏసీలు వేసుకుని ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టారు. ప్రస్తుతం చాలా మంది వేసవి కాలంలోనే కాకుండా మామూలు సమయాల్లో కూడా ఏసీలు వాడటం ఎక్కువైంది. అయితే రెగ్యులర్‌గా ఏసీలు వాడేవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ,సీజనల్‌గా ఏసీ వాడే వాళ్లు మాత్రం సమ్మర్‌కి ముందు మర్చిపోకుండా సర్వీసింగ్‌ చేయించాలి. ఏసీ రెగ్యులర్‌గా వాడే వారికి ఒక సందేహం ఉంటుంది. ఏసీ ఆన్‌ చేసినప్పుడు ఫ్యాన్‌ ఆన్‌లో ఉంచడం వల్ల ఏం జరుగుతుందని అని. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి సీలింగ్‌ ఫ్యాన్‌ను ఏసీతో ఉపయోగించినప్పుడు మీరు సులభంగా విద్యుత్తును ఆదా చేయవచ్చు. అలాగే ఏసీ ఉష్ణోగ్రత 24 నుంచి 26 మధ్య ఉండాలి. ఫ్యాన్‌ను తక్కువ వేగంతో ఉంచాలి. ఇలా చేయడం వల్ల గది మొత్తం త్వరగా చల్లబడుతుంది. ఆ తర్వాత ఏసీ ప్లీప్‌ మోడ్‌లోకి వెళ్లినా సరే గది చల్లగానే ఉంటుంది. మనం ఆరు గంటల పాటు ఏసీని ఉపయోగించినప్పుడు 12 యూనిట్లు.. అదే సమయంలో ఏసీతో ఫ్యాన్‌ను ఉపయోగిస్తే 6 యూనిట్లు మాత్రమే అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Next Story