మన ఆరోగ్యానికి వ్యాయామం మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఈ మధ్య కాలంలో జిమ్‌లో అతిగా వ్యాయామం చేస్తూ గుండెపోటు బారిన పడి కొందరు మృతి చెందిన సంఘటనలు తరచూ చూస్తున్నాం...
అందుకే వ్యాయామం చేస్తున్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడటం మంచిది.
జిమ్‌లో వర్కౌట్స్ చేసేటప్పుడు గుండె దగ్గర అసౌకర్యంగా, ఒత్తిడిగా అనిపించినా, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నా, కాస్త నొప్పిగా అనిపించినా వెంటనే వర్కౌట్స్ ఆపేసి ఆస్పత్రికి వెళ్లండి.
వ్యాయామం చేస్తున్నప్పుడు తల తిరుగుతున్నట్టు అనిపించడం, మూర్ఛ, మైకం, గుండె కొట్టుకునే వేగం పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకుండా డాక్టర్‌ను సంప్రదించండి.
వ్యాయామం చేసినప్పుడు సాధారణంగా చెటమలు పడతాయి. కానీ అసాధారణంగా చెమటపడితే మాత్రం గుండెపోటు వచ్చే అవకాశం ఉందని అర్థం.
ఎడమ చేతుల్లో నొప్పి, మెడ నుంచి దవడ వైపుగా నొప్పి రావడం, పొత్తి కడుపులో అసౌకర్యంగా అనిపించడం, తీవ్ర ఒత్తిడి రావడం ఇవన్నీ కూడా గుండె అనారోగ్యాన్ని సూచిస్తాయి. వర్కౌట్స్ చేసేటప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి టెస్టులు చేయించుకోవడం మంచిది.