స్లీపింగ్ మాస్క్ వాడుతున్నారా?
చర్మ సంరక్షణలో భాగంగా రాత్రివేళ స్లీపింగ్ మాస్క్‌లను ఉపయోగించడం ఈ మధ్య పెరిగింది.
By - అంజి |
స్లీపింగ్ మాస్క్ వాడుతున్నారా?
చర్మ సంరక్షణలో భాగంగా రాత్రివేళ స్లీపింగ్ మాస్క్‌లను ఉపయోగించడం ఈ మధ్య పెరిగింది. ఇది రాత్రి నిద్రిస్తున్నప్పుడు చర్మానికి తేమను, పోషణను అందిస్తుంది. సాధారణంగా ఇవి లైట్ క్రిమ్ లేదా జెల్ లాగా ఉంటాయి. చర్మంపై వృద్ధాప్య ఛాయలను తగ్గించడానికి వీటిని ఉపయోగిస్తారు. వీటిని రాత్రి పూట ముఖానికి వేసుకుని మరుసటి రోజు ఉదయం కడిగేస్తారు. అయితే కొందరు ప్రతి రాత్రి స్లీపింగ్ మాస్క్ ఉపయోగిస్తారు. ఇది సరైన విధానం కాదని.. దీని వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
వీటిని తరచూ ఉపయోగించడం వల్ల చర్మం ఎక్కువ నూనెను ఉత్పత్తి చేయడంతో పాటు సహజ తేమను కోల్పోతుంది. మొటిమలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చర్మం సున్నితంగా ఉంటే.. వారానికి 1 నుంచి 2 సార్లు మాత్రమే స్లీపింగ్ మాస్క్‌ని ఉపయోగించాలి. చర్మం పొడిగా ఉంటే.. దానికి మరింత తేమ అవసరం. దీని కోసం స్లీపింగ్ మాస్క్‌ని వారానికి రెండు మూడు సార్లు ఎటువంటి సమస్యల లేకుండా ఉపయోగించవచ్చు. అయితే వీటిని వినియోగించే ముందు ఒకసారి స్కిన్ కేర్ నిపుణులను సంప్రదించడం మంచిది.