ముంబైకి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా.. శరీరం లెడ్ పాయిజనింగ్ అయిందని వైద్య పరీక్షల్లో తేలింది. అయితే దీఇకి కారణం ఏంటో తెలుసా?.. ప్రెషర్ కుక్కర్. అవును మీరు చదివింది నిజమే. మనం ఇంట్లో రోజూ వాడే అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ వల్ల ఈ సమస్య వచ్చిందని డాక్టర్లు గుర్తించారు. పాత, పాడైన అల్యూమినియం కుక్కర్‌లో వండితే ఆహారంలో సీసం, అల్యూమినియం చేరతాయని, తద్వారా లెడ్ పాయిజనింగ్‌కు గురవుతారని నిర్ధారించారు.
లెడ్ పాయిజనింగ్ లక్షణాలు
కడుపు తిమ్మిరిగా ఉండడం, హైపర్ యాక్టివిటీ, తలనొప్పి, వాంతులు, వికారంగా ఉండడం, అనిమీయా, కాళ్లు, పాదాల్లో వణుకు, వ్యంధ్వత్య సమస్యలు, మూత్ర పిండాల సమస్యలు వస్తాయి.
ఏం చేయాలంటే?
వీలైనంత వరకు అల్యూమినియం పాత్రలను వంటక వాడకపోవడమే మంచిది. వీటికి బదులు స్టీలు కుక్కర్, స్టీల్ పాత్రలు వంటకు వాడాలి. అలాగే మీ కుక్కర్ బాగా పాతది అయితే దాన్ని మార్చడం మంచిది. అలాగే వీటిల్లో వండేటప్పుడు చెక్క గరిటలు వాడాలి. అల్యూమినియం పాత్రల్లో డీప్ ఫ్రైలు చేయకూడదు.