చెప్పులు వేసుకొని డ్రైవింగ్‌ చేస్తున్నారా?

కొందరి నిత్య జీవితంలో డ్రైవింగ్‌ అనేది ఓ భాగం. వారు కొన్ని సందర్భాల్లో చెప్పులు (స్లిప్పర్లు) ధరించి కారు/ బైక్‌ నడపడం చేస్తుంటారు.

By -  అంజి
Published on : 2 Nov 2025 2:07 PM IST

driving, wearing sandals, Lifestyle

చెప్పులు వేసుకొని డ్రైవింగ్‌ చేస్తున్నారా?

కొందరి నిత్య జీవితంలో డ్రైవింగ్‌ అనేది ఓ భాగం. వారు కొన్ని సందర్భాల్లో చెప్పులు (స్లిప్పర్లు) ధరించి కారు/ బైక్‌ నడపడం చేస్తుంటారు. అయితే రోడ్డు, రవాణా నిపుణులు ఈ అలవాటు సురక్షితం కాదని హెచ్చరిస్తున్నారు. చెప్పులు వేసుకొని డ్రైవింగ్‌ చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో పెడల్స్‌ (బ్రేక్‌/ యాక్సిలరేటర్‌), గేర్‌ లీవర్‌పైన సరైన పట్టు (గ్రిప్‌) ఉండదని, ఇవి పాదం నుంచి సులభంగా జారిపోయే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ఈ చిన్న పొరపాట్లు డ్రైవింగ్‌లో ప్రమాదాలకు దారి తీయవచ్చని అంటున్నారు.

అందుకే చెప్పులకు బదులుగా కాళ్లకు పట్టు ఉండే సైండిళ్లు లేదా బూట్లు ధరించి డ్రైవింగ్‌ చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఓ ప్రచారం కూడా వైరలవుతోంది. చెప్పులు వేసుకొని డ్రైవింగ్‌ చేయడం ట్రాఫిక్‌ నియమాలకు విరుద్ధం, చట్టవిరుద్ధం అని కొందరు పోస్టులు పెడుతున్నారు. కానీ, ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. మోటారు వాహన చట్టం ప్రకారం.. చెప్పులు ధరించి ఎవరైనా వాహనం నడుపుతున్నట్టయితే వారికి జరిమానా విధించడం లేదా చలానా వేసే నిబంధన ఏదీ లేదు.

Next Story